E-Paper
Advertisement

కోహ్లీ కంటే గొప్పోడ‌నే బాబ‌ర్ ఆజంపై బుర‌ద జ‌ల్లుతున్నారు..DKపై త‌న్వీర్ ఫైర్‌

కోహ్లీ కంటే గొప్పోడ‌నే బాబ‌ర్ ఆజంపై బుర‌ద జ‌ల్లుతున్నారు..DKపై త‌న్వీర్ ఫైర్‌
Advertisement

Tanveer Ahmed Fires On Dinesh Karthik: ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య లీడ్స్ వేదికగా మొన్న ఆగస్టు 19వ తేదీన తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఇవాళ మూడవ రోజు మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితులు చూస్తుంటే పాకిస్తాన్ పైన అవలీలగా ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చేస్తున్న దినేష్ కార్తీక్, పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై బాబర్ ఆజంకు ఎలాంటి రికార్డు లేదని.. అతని వల్ల పాకిస్తాన్ గెలిచే అవకాశం లేదని పరువు తీశారు. ఇంగ్లాండ్ కు భయపడి గాయం పేరుతో డ్రామాలాడుతున్నాడని ఆరోపణలు చేశారు. అందుకే తొలి టెస్ట్ నుంచి తెలివిగా తప్పుకున్నాడని బాంబు పేల్చారు.

కోహ్లీ కంటే గొప్పోడ‌నే బాబ‌ర్ ఆజంపై బుర‌ద జ‌ల్లుతున్నారు..

పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దినేష్ కార్తీక్ పై సీరియస్ అయ్యారు తన్వీర్ అహ్మద్. అదే సమయంలో నాజరు హుస్సేన్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పవాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక… తమ కెప్టెన్ పై దినేష్ కార్తీక్ లాంటి వాళ్లు బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం కు మెరుగైన రికార్డులు ఉన్న విషయాన్ని పరిశీలించకుండా… నోటికి ఏది వస్తే అది వాగేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు విషయాలను తెలుసుకొని.. మాట్లాడాలని మండిపడ్డారు. ఎప్పుడు టీమిండియా క్రికెటర్లే గొప్పవాళ్లు ఉండరని… తమ పాకిస్తాన్ క్రికెటర్లు కూడా అద్భుతమైన ఆటగాళ్లు అని ప్రశంసించారు. కానీ దినేష్ కార్తీక్ లాంటి వాళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్థానం కోల్పోతామన్న భయంతో విరాట్ కోహ్లీ డప్పు కొడుతున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

విరాట్ కోహ్లీ కంటే బాబర్ బెటర్.. రికార్డులు ఇవే

పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ చెప్పినట్లుగా… విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం ఇంగ్లాండ్ గడ్డపై మెరుగైన ఆటగాడని తెలుస్తోంది. ఇప్పుడు వరకు ఇంగ్లాండు గడ్డపై విరాట్ కోహ్లీ 17 టెస్టులు ఆడాడు. ఇందులో ఐదు అర్థ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు నమోదు చేశాడు. యావరేజ్ 33 మాత్రమే ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై 65 యావరేజ్ తో పాటు మూడు అర్థ సెంచరీలు కూడా నమోదు చేసుకున్నాడు. అంటే విరాట్ కోహ్లీ కంటే చాలావరకు బెటర్ అని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూసి బాబర్ ను విమర్శలు చేయాలని దినేష్ కార్తీక్ కు కౌంటర్ ఇస్తున్నారు తన్వీర్ అహ్మద్.

Advertisement

 

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

 

 

 

 

 

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×