E-Paper
Advertisement

అందరినీ తొక్కి చిరు మెగాస్టార్ అయ్యాడా.. కళ్యాణ్ దిలీప్ కామెంట్స్ వైరల్!

అందరినీ తొక్కి చిరు మెగాస్టార్ అయ్యాడా.. కళ్యాణ్ దిలీప్ కామెంట్స్ వైరల్!
Advertisement

Chiranjeevi Controversy: ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరు బర్త్ డే అన్న సంగతి అందరికి తెలిసిందే.ఇక ఇలా చిరు పుట్టిన రోజు దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలోనూ ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.చిరు ఎంతో మందిని తొక్కేశాడని, వారిలో సుమన్ నుండి ఉదయ్ కిరణ్ వరకు ఎందఱో ఉన్నారని ఆ వీడియో సారాంశం.

దీంతో ఈ వీడియోపై స్పందిస్తూ చిరంజీవి నిజంగానే తన కష్టంతో పైకి వచ్చారా లేక ఇతరుల అవకాశాలను తొక్కి ఈ స్థాయిలోకి వచ్చారా అన్న ప్రశ్నపై తనదైన శైలిలో సమాధానమిచ్చాడు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర .

ఎంతమాత్రం నిజం లేదు 

Advertisement

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ విమర్శల్లో ఎంతమాత్రం నిజం లేదని, స్వయంకృషితో ఎదిగిన ఒక మహోన్నత నటుడిపై కేవలం అసూయతోనే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.

ఏ సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు, కేవలం తనలోని ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతోనే టాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగారని చెప్పుకొచ్చాడు.ఇండస్ట్రీలో ఎవరి కష్టం వారిదే అని, ఇక్కడ ఒకరిది ఇంకొకరు లాక్కోవడం అనేది ఉండదని, అది అసాధ్యం కూడా అని కుండబద్దలు కొట్టేశారు.

చిరు డేట్స్ కోసం క్యూ 

Advertisement

ఇక సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద ఎవరు సత్తా చాటితే,కలెక్షన్స్ ఎవరు ఎక్కువ కొల్లగొడితే వారి చుట్టే తిరుగుతారని తెలిపాడు.ఇక ఆ సత్తా చిరంజీవికే ఉందని అందుకే ఆయన డేట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టేవారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

చిరు తన అద్భుతమైన డాన్సులు, ఫైట్లతో తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చేసి, కోట్లాది మంది అభిమానులకు ఆయన ఒక ఇన్స్పిరేషన్‌గా నిలిచారని అందుకే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడని తెలిపారు.

ఒక్క ఎగ్జాంపుల్ ని కూడా చూపెట్టలేరు

ఇక సోషల్ మీడియా వచ్చాక కొందరు ఉద్దేశపూర్వకంగా చిరంజీవి గారిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తనదైన శైలిలో విమర్శించారు కళ్యాణ్ సుంకర. ఆయనతో సినిమాలు తీసి రోడ్డున పడ్డారని ప్రచారం చేసేవారు అందుకు ఒక్క ఎగ్జాంపుల్ ని కూడా చూపెట్టలేరని మనసులోని మాటను బయటపెట్టారు.

also read :షావుకారు జానకికి ‘షావుకారు’ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తున్న వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ వంటి బానర్లు ఆయనతో సినిమాలు తీసే ఈ స్థాయికి ఎదిగాయని కుండబద్దలు కొట్టేశారు.మొత్తంగా మెగా స్టార్ ని పట్టుకొని తొక్కేస్టార్ తొక్కేస్టార్ అనే వారు అసలు విషయం తెలుసుకోవాలని హితవు పలికారు దిలీప్ కళ్యాణ్ సుంకర !

Tags

Related News

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

18 ఏళ్లకే హీరోయిన్ గా.. షావుకారు జానకి నటించిన చివరి తెలుగు చిత్రం!

షావుకారు జానకికి ‘షావుకారు’ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కన్నుమూసిన షావుకారు జానకి.. స్పందిస్తున్న సెలబ్రిటీలు!

పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? రాశీ సింగ్ కామెంట్స్ వైరల్

ఇండస్ట్రీలో విషాదం.. షావుకారు జానకి కన్నుమూత!

Big Stories

Advertisement
×