E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఐఫోన్‌కే టెన్షన్.. పుట్టించే డిజైన్! టెక్నో పోవా 8 ఫీచర్లకు ఫ్యూజులు అవుట్

ఐఫోన్‌కే టెన్షన్.. పుట్టించే డిజైన్! టెక్నో పోవా 8 ఫీచర్లకు ఫ్యూజులు అవుట్
Advertisement

Tecno Pova 8 5G Review: బోల్డ్ అండ్ ట్రెండీ డిజైన్‌తో మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వచ్చేసింది Tecno Pova 8 5G.ఈ మొబైల్ వెను భాగంలో ఇచ్చిన ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’ లైటింగ్ ఎఫెక్ట్స్ యూత్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. అంతేకాదు.. ఏకంగా 8000mAh బ్యాటరీతో నాన్‌స్టాప్ పవర్‌ను అందిస్తోంది. అయితే.. మిడ్-రేంజ్ ధరతో వచ్చిన ఈ ఫోన్ నిజంగానే అంత వర్త్ ఆ? దీని ఫీచర్లు, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ రివ్యూలో క్లియర్ గా తెలుసుకుందాం.

Tecno Pova 8 పూర్తి రివ్యూ:

1.బోల్డ్ డిజైన్:

టెక్నో కంపెనీ ఎప్పుడూ డిజైన్ల విషయంలో.. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంది. ఈ సారి ‘పోవా 8’ తో ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. బ్యాక్ ప్యానెల్ చూస్తే.. సైబర్ పంక్ థీమ్‌తో, ట్రాన్స్‌పరెంట్ స్టైల్‌లో భలే క్రేజీగా ఉంది. ఇందులో హైలైట్ ఏంటంటే.. వెనక ఉండే ఎల్‌ఈడీ లైట్ సెటప్. కాల్స్ వచ్చినా.. ఛార్జింగ్ పెట్టినా నోటిఫికేషన్స్ కి తగినట్టుగా ఈ లైట్స్ బ్లింక్ అవుతాయి. నథింగ్ ఫోన్ గ్లిఫ్ లైట్స్ గుర్తున్నాయిగా? దాదాపు అలాంటి వైబే ఇస్తుంది.

2.డిస్‌ప్లే & స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్:

Advertisement

ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల FHD+ IPS LCD డిస్‌ప్లే ఇచ్చారు. అవును.. మీరు విన్నది నిజమే… ఈ రేంజ్‌లో అమోలెడ్ ఇస్తే బాగుండేది, కానీ ఎల్‌సీడీతోనే అడ్జస్ట్ అవ్వాలి. అయితే 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మాత్రం చాలా స్మూత్‌గా సాగిపోతాయి. 950 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల నార్మల్ యూసేజ్‌కి బానే ఉంటుంది కానీ.. ఎండలో చూసేటప్పుడు కొంచెం కష్టపడాల్సిందే.

3.కొండంత బ్యాటరీ.. ఆగని పవర్:

ఈ ఫోన్‌కి అసలైన హీరో ఎవరంటే… దీనిలో ఉండే 8000mAh బ్యాటరీ. అసలు నార్మల్ యూజర్లు అయితే.. రెండు రోజుల వరకు ఛార్జర్ ఎక్కడ ఉందో కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. హెవీగా గేమింగ్ ఆడినా ఒక రోజంతా ఈజీగా వస్తుంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే ఇస్తున్నారు. ఫోన్ కొంచెం బరువుగా (225 గ్రాములు) ఉండటానికి ఈ భారీ బ్యాటరీనే కారణం.

4.పర్ఫార్మెన్స్ & గేమింగ్:

Advertisement

Pova 8 లో MediaTek Dimensity 7100 ప్రాసెసర్ దీనిలో వాడారు. డైలీ యాప్స్ వాడటానికి, మల్టీటాస్కింగ్‌కి ఎలాంటి లాగ్స్ ఉండవు. గేమ్స్ కూడా మీడియం టు హై సెట్టింగ్స్‌లో ఆడుకోవచ్చు. హీటింగ్ సమస్య రాకుండా గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ కూడా పెట్టారు.అంతే కాకుండా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ HiOS 16 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇందులో ఉండే ఏఐ ఫీచర్లు (AI యూట్యూబ్ సమ్మరీ, నాయిస్ క్యాన్సిలేషన్) చాలా బాగా హెల్ప్ అవుతాయి.

Also Read: రూ.1500 లోపే ప్రీమియం స్మార్ట్‌వాచ్..ఎగబడి కొంటున్న జనం

5.కెమెరా :

వెనక 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా ఉంది. పగటిపూట లైటింగ్‌లో ఫోటోలు క్రేజీ కలర్స్‌తో, సోషల్ మీడియా.. రెడీగా వస్తాయి. కానీ నైట్ టైమ్‌లో డిటైలింగ్ కొంచెం తగ్గుతుంది. ఇక సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రీల్స్, వీడియోల కోసం 2K రికార్డింగ్ ఆప్షన్ ఉంది కానీ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) లేకపోవడం మైనస్.

మీకు అదిరిపోయే స్టైలిష్ లుక్, ఎప్పటికీ అయిపోని బ్యాటరీ లైఫ్ కావాలంటే.. Tecno Pova 8 బెస్ట్ ఆప్షన్. కానీ కేవలం డిస్‌ప్లే, అల్ట్రావైడ్ కెమెరా మాత్రమే ముఖ్యం అనుకుంటే.. మార్కెట్లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

Tecno Pova 8 5G ధరల వివరాలు:

ఇండియన్ మార్కెట్లో లభించే వేరియంట్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

6GB RAM + 128GB స్టోరేజ్: రూ.29,999

8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 31,999

Related News

సింగిల్ ఛార్జ్‌తో..10 గంటల పాటలు! బోట్ నుంచి.. కిల్లర్ బ్లూటూత్ స్పీకర్

ఏఐ క్లీనిక్స్.. డాక్టర్ లేకుండానే సెకన్లలో రోగ నిర్ధరణ, చికిత్స.. మందులు కూడా అవే ఇచ్చేస్తాయ్!

సింగిల్ ఛార్జ్‌తో వారం రోజులు! రియల్‌మీ సరికొత్త ఇయర్‌బడ్స్ రివ్యూ!

రూ.1500 లోపే ప్రీమియం స్మార్ట్‌వాచ్..ఎగబడి కొంటున్న జనం

అదిరిపోయే లుక్, సూపర్ ఫీచర్లతో.. మార్కెట్‌ను షేక్ చేస్తున్నస్మార్ట్ వాచ్

పిల్లల హెల్త్ సేఫ్.. ఈ వాషింగ్ మెషీన్లతో హైజీన్ వాష్

ఏసీ vs డీహ్యూమిడిఫైయర్.. రెండింటికి తేడా ఏంటి? వర్షాకాలంలో ఏది బెస్ట్?

Big Stories

×