Tecno Spark 30C Launched: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. తరచూ ఏదో ఒక కంపెనీ ఫోన్ దేశీయ మార్కెట్‌లో లాంచ్ అవుతూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ఒకప్పటి కంటే ఇప్పుడు మొబైల్స్ వాడేవారు ఎక్కువైపోయారు. ఒక్కొక్కరి దగ్గర ఒకటి లేదా రెండు ఫోన్లు ఉంటున్నాయి. దీని కారణంగానే దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరిగిపోయింది. రోజుకో కొత్త మొబైల్ మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
ఇందులో భాగంగానే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ టెక్ కంపెనీ టెక్నో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సామాన్యులకు అందుబాటు ధరలో ఫోన్లను రిలీజ్ చేస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. ఇప్పటికే చాలా ఫోన్లను విడుదల చేసి ఊహించని విధంగా దూసుకుపోతున్న కంపెనీ తాజాగా మరొక కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది.
టెక్నో కంపెనీ తన లైనప్‌లో ఉన్న Tecno Spark 30Cని మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల LCD డిస్‌ప్లేను అందించే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు Tecno Spark 30C ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర ఇతర విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: మోటో మామ ఇచ్చిపడేశాడు.. ఇండియాలోకి వచ్చేస్తున్న మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్, చుక్కలు కనబడతాయ్!
Tecno Spark 30C Specifications
Tecno Spark 30C స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వచ్చింది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. అంతేకాకుండా ఇందులో MediaTek Helio G81 చిప్‌సెట్ ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4GB/128GB, 6GB/128GB, 4GB/256GB, 8GB/256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది.
ఆడియో కోసం డ్యూయల్ సిమెట్రిక్ స్పీకర్లు చేర్చబడ్డాయి. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం దీనికి IP54 రేటింగ్ ఇవ్వబడింది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. Spark 30C స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Tecno Spark 30C Price
Tecno Spark 30C ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇది సామాన్యులకు అందుబాటు ధరలో అంటే అతి చౌక ధరలో ఉండొచ్చని తెలుస్తోంది. కొన్ని లీక్‌ల ప్రకారం.. ఇది రూ.12,999 ప్రారంభ ధరను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్బిట్ బ్లాక్, ఆర్బిట్ వైట్, మ్యాజిక్ స్కిన్ 3.0 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.