E-Paper
Advertisement

Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!

Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!
Advertisement

Telegram: భారతదేశంలో టెలిగ్రామ్ వినియోగదారులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఈ మెసేజింగ్ యాప్‌పై ఉన్న తాత్కాలిక ఆంక్షలను ప్రభుత్వం క్రమంగా తొలగిస్తోంది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో టెలిగ్రామ్ యాప్ మళ్లీ ప్రత్యక్షమైంది. చాలామంది యూజర్లకు సందేశాలు యథావిధిగా డెలివరీ అవుతున్నాయి. అయితే, ఆంక్షలు తొలగినప్పటికీ కొంతమందికి ఇంకా యాప్ సరిగ్గా పని చేయడం లేదు. అలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

యాప్ స్టోర్లలోకి టెలిగ్రామ్ రీఎంట్రీ:

నిషేధం కారణంగా గత కొన్ని రోజులుగా కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికీ, లేదా రీఇన్‌స్టాల్ చేయడానికీ వీలు లేకుండా పోయింది. దీనివల్ల యూజర్లు తీవ్ర ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. యాప్ స్టోర్లతో పాటు టెలిగ్రామ్ అధికారిక వెబ్‌సైట్ కూడా ఇప్పుడు భారత్‌లో సాధారణంగా పనిచేస్తోంది. డిజిటల్ సర్వీసులు మళ్లీ మునుపటిలా అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

Also Read: రూ.లక్షన్నర పెట్టి Vivo X Fold 6 కొనాలా? 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అంతలా ఏముంది?

మెసేజ్‌లు వెళ్లడం లేదా?

ఆంక్షలు ఎత్తేసినా మీ ఫోన్‌లో టెలిగ్రామ్ చాట్స్ ఓపెన్ కాకపోయినా లేదా మెసేజ్‌లు వెళ్లకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. యాప్‌ను ఒకసారి అప్‌డేట్ చేసి, రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారైతే ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోని Apps విభాగంలోకి వెళ్లి టెలిగ్రామ్‌ను సెలెక్ట్ చేసి Force Stop చేయాలి. ఇప్పుడు యాప్‌ను మళ్లీ ఓపెన్ చేస్తే సర్వర్లతో కొత్త కనెక్షన్ ఏర్పడి యాప్ సజావుగా పనిచేస్తుంది. ఐఫోన్ వినియోగదారులు కూడా యాప్ స్టోర్‌లో అప్‌డేట్ చేసుకుని, యాప్ స్విచర్ ద్వారా యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేస్తే సరిపోతుంది.

ఆంక్షలు ఎందుకు విధించారంటే?

Advertisement

ఇటీవల దేశంలో జరిగిన NEET-UG రీ-ఎగ్జామినేషన్ సమయంలో పరీక్షకు సంబంధించిన కీలక సమాచారం లేదా ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్ ద్వారా లీక్ అయ్యే అవకాశం ఉందనే అనుమానంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా జరగడం కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. ఆ పరీక్షల కాలం ముగియడంతో ఇప్పుడు ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నారు.

ఆ ఫీచర్ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే:

యాప్ సేవలు పునరుద్ధరణ అవుతున్నప్పటికీ.. టెలిగ్రామ్‌లోని Message Editing ఫీచర్‌పై ఉన్న పరిమితి మాత్రం ఇంకా కొనసాగుతోంది. మునుపటి ఆదేశాల ప్రకారం జూన్ 30 వరకు యూజర్లు తాము పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి వీలుండదు. ఈ ఒక్క ఫీచర్ మినహా మిగిలిన చాటింగ్, కాలింగ్ సేవలు త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

Also Read: మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!

Related News

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

Big Stories

Advertisement
×