E-Paper
Advertisement

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!
Advertisement

Hidden Earbuds Tricks: ప్రస్తుత కాలంలో ప్రయాణాల్లో ఉన్నా.. ఆఫీసులో పని చేస్తున్నా, లేదా ఇంట్లో బోర్ కొట్టినా మన చెవుల్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఉండాల్సిందే. మ్యూజిక్ లవర్స్ అయితే తమ జీవితంలో సగం సమయం వీటితోనే గడుపుతుంటారు. అయితే మనం రోజూ వాడే ఇయర్ బడ్స్‌లో ఎవరికీ తెలియని కొన్ని పవర్‌ఫుల్ ఫీచర్లు, సీక్రెట్ ట్రిక్స్ దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకుంటే.. బడ్స్ వాడే విధానమే పూర్తిగా మారిపోతుంది. టెక్ నిపుణులు కూడా వాడే ఆ అద్భుతమైన 5 ట్రిక్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ఆడియో బ్యాలెన్స్ & నాయిస్ అడ్జస్ట్‌మెంట్ ట్రిక్:

చాలా మందికి ఒక ఇయర్ బడ్ చెవిలో సరిగ్గా వినిపించకపోతే.. అది పాడైపోయిందని పడేస్తుంటారు. కానీ మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘అక్సెసిబిలిటీ’ఆప్షన్‌కి వెళ్లి ‘ఆడియో బ్యాలెన్స్’ను అడ్జస్ట్ చేయడం ద్వారా రెండు బడ్స్ సౌండ్‌ను సమానంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే మోనో ఆడియో ఆన్ చేయడం ద్వారా సింగిల్ ఇయర్ బడ్ వాడేటప్పుడు కూడా పర్ఫెక్ట్ సౌండ్ ఫీల్ పొందవచ్చు.

2.గేమింగ్ మోడ్ లేదా లో-లేటెన్సీ యాక్టివేషన్:

Advertisement

మనం బడ్స్‌తో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు సౌండ్ కాస్త ఆలస్యంగా వినిపిస్తుంటుంది. దీని కోసం చాలా బడ్స్‌లో ప్రత్యేకంగా ‘గేమింగ్ మోడ్’ లేదా ‘లో-లేటెన్సీ మోడ్’ ఉంటుంది. బడ్స్ టచ్ ప్యానెల్‌పై.. మూడు లేదా నాలుగు సార్లు ట్యాప్ చేయడం ద్వారా లేదా కంపెనీ కంపానియన్ యాప్ ద్వారా ఈ మోడ్‌ను ఆన్ చేస్తే.. ఆడియో, వీడియో మధ్య సింక్ పర్ఫెక్ట్‌గా కుదురుతుంది.

3. కస్టమ్ ఈక్వలైజర్ & సౌండ్ బూస్ట్ ట్రిక్ :

ఇప్పుడు మనం చెప్పుకునే.. మూడవ ట్రిక్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మనం సాధారణంగా వాడే ఇయర్ బడ్స్ నుంచి వచ్చే సాధారణ సౌండ్ కాకుండా.. సినిమాల్లో లాగా థియేటర్ బేస్ , క్రిస్టల్ క్లియర్ వాయిస్ రావాలంటే మీ ఫోన్‌లోని ‘సౌండ్ అండ్ వైబ్రేషన్’ సెట్టింగ్స్‌లో ఉండే ‘ఈక్వలైజర్’ సెట్ చేసుకోవాలి. బేస్ బూస్ట్, కస్టమ్ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయడం ద్వారా, సాధారణ బడ్స్ సైతం ప్రీమియం హెడ్‌ఫోన్స్ లాగా అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఈ ట్రిక్ మ్యూజిక్ లవర్స్‌కి నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.

4. మల్టీ-డివైస్ కనెక్షన్ ట్రిక్:

Advertisement

మీరు లాప్‌టాప్‌లో సినిమా చూస్తున్నప్పుడు సడన్‌గా ఫోన్‌కి కాల్ వస్తే ఏం చేస్తారు? బడ్స్‌ను డిస్‌కనెక్ట్ చేసి ఫోన్‌కి కనెక్ట్ చేస్తారు. కానీ మీ బడ్స్‌లో ‘డ్యుయల్ కనెక్షన్’ ఫీచర్ ఉంటే ఈ ఇబ్బంది ఉండదు. సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ను ఆన్ చేయడం ద్వారా ల్యాప్‌టాప్ , ఫోన్ రెండింటికి ఒకేసారి బడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. లాప్‌టాప్‌లో మ్యూజిక్ ఆగిపోగానే ఫోన్ కాల్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది.

Also Read: ఆఫర్‌లో 40 ఇంచుల టీవీ రూ. 20 వేలకే..సేల్ పూర్తవకముందే కొనేయండి

5. వాయిస్ అసిస్టెంట్ అండ్ టచ్ కంట్రోల్ :

మీ పాకెట్‌లో ఫోన్ ఉన్నప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయడానికి లేదా ట్రాక్ మార్చడానికి ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం లేదు. బడ్స్ యాప్ సహాయంతో.. టచ్ కంట్రోల్స్‌ను మీ ఇష్టానికి మార్చుకోవచ్చు. సింగిల్ ట్యాప్,డబుల్ ట్యాప్ లేదా లాంగ్ ప్రెస్ ద్వారా వాల్యూమ్ పెంచడం, గూగుల్ అసిస్టెంట్ లేదా సిరిని యాక్టివేట్ చేయడం వంటి పనులను ఈజీగా చేసుకోవచ్చు.

ఇప్పటివరకు సాధారణంగా వాడుతున్న మీ ఇయర్ బడ్స్‌లో ఇన్ని రహస్య ఫీచర్లు ఉన్నాయని తెలిశాక ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ఈ ట్రిక్స్ అన్నీ మీ ఫోన్లో ట్రై చేసి చూడండి. మీ మ్యూజిక్ వల్ల బడ్స్ వాడకం మరింత ఈజీగా మారిపోతుంది.

Related News

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ పేపర్ వేసి చూడండి.. దుర్వాసన, జిడ్డు మరకల బాధే ఉండదు!

హైయర్ 5-స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సగం ధరకేనా? Amazon Saleలో మతిపోయే ఆఫర్!

మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!

స్మార్ట్‌ఫోన్ లైఫ్ పెంచాలా? ఈ 5 తప్పులు ఈ రోజు నుంచే ఆపేయండి!

Big Stories

Advertisement
×