E-Paper
Advertisement

రూ.లక్షన్నర పెట్టి Vivo X Fold 6 కొనాలా? 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అంతలా ఏముంది?

రూ.లక్షన్నర పెట్టి Vivo X Fold 6 కొనాలా? 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అంతలా ఏముంది?
Advertisement

Vivo X Fold 6: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం వివో సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. జూన్ 26న చైనా మార్కెట్లో విడుదల కాబోతున్న ‘వివో ఎక్స్ ఫోల్డ్ 6’ మోడల్‌కు సంబంధించిన ధరలు, కీలక ఫీచర్లు లాంచ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. గత మోడళ్లతో పోలిస్తే.. ఈసారి వివో భారీ అప్‌గ్రేడ్స్‌తో ఈ ప్రీమియం ఫోన్‌ను తీసుకొస్తోంది.

భారీగా పెరిగిన ధరలు:

తాజాగా లీకైన వివరాల ప్రకారం.. Vivo X Fold 6 మొత్తం నాలుగు వేరియంట్లలో లభించనుంది. బేస్ వేరియంట్ అయిన 12GB RAM, 256GB స్టోరేజ్ ధర సుమారు రూ.1.40 లక్షలు ఉండొచ్చు. అలాగే టాప్ఎండ్ వేరియంట్ అయిన 16GB RAM, 1TB స్టోరేజ్ ధరను రూ.1.75 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన X Fold 5 బేస్ వేరియంట్ ధరతో పోలిస్తే.. ఈసారి ధరలు చాలా పెరిగాయని చెప్పాలి.

Advertisement

Also Read: భారత్‌లో boAt Airdopes ProClip లాంచ్.. తక్కువ ధరలో ప్రైవసీకి పక్కా గ్యారెంటీ!

కళ్లు చెదిరే బ్యాటరీ లైఫ్:

ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ. ఏకంగా 7000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ కానుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే నిరంతరాయంగా 8 నుంచి 8 గంటల పాటు వినియోగించుకోవచ్చని కంపెనీ హింట్ ఇస్తోంది.

ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్:

Advertisement

సాఫ్ట్‌వేర్ పరంగా కూడా వివో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయబోతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 Foldతో నడుస్తుంది. దీనివల్ల యూజర్లకు సరికొత్త ఇంటర్‌ఫేస్, వేగవంతమైన పెర్ఫార్మెన్స్ లభిస్తుంది.

లాంచ్ ఎప్పుడంటే?

ఈ అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ జూన్ 26న చైనా కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ వేడుకలోనే దీని పూర్తి వివరాలు, అలాగే గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే విషయాలు అధికారికంగా తెలియనున్నాయి.

Also Read: మీ WhatsApp హ్యాక్ అయిందా? ఢిల్లీ పోలీస్ చెప్పిన ఈ సీక్రెట్ కోడ్‌తో క్షణాల్లో రికవరీ చేయొచ్చు!

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×