BigTV English

Apple Day Sale 2024: ఆఫర్ల వరద.. ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Apple Day Sale 2024: ఆఫర్ల వరద.. ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Apple Day Sale 2024: గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఆపిల్ డేస్ 2024 సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గతేడాది లాంచ్ చేసిన iPhone 15 Pro పై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాత్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా ఫోన్‌పై రూ.14,910 తగ్గింపుతో ఫోన్ దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఆఫర్ సమయంలో iPhone 15 Pro ధర రూ.1,19,990గా ఉంది. 256GB వేరియంట్ ధర రూ.1,29,990. 1TB వేరియంట్‌ ధర రూ.1,69,990. బ్యాంక్ ఆఫర్ల గురించి మాట్లాడితే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఫోన్‌‌పై 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలానే ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా రూ. 50,000 వరకు తగ్గింపును కూడా దక్కించుకోవచ్చు.

Also Read: హిట్ అయ్యే ఫోన్ ఇది.. ఐక్యూ బడ్జెట్ ఫోన్.. డబ్బులు రెడీ చేస్కోండి!


Apple iPhone 15 Pro మొబైల్ 12 సెప్టెంబర్ 2023న విడుదలైంది. ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ 6.10-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది అంగుళానికి 460 పిక్సెల్స్‌తో 1179×2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. Apple iPhone 15 Pro హెక్సా-కోర్ Apple A17 Pro ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 8GB RAM తో వస్తుంది. Apple iPhone 15 Pro వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Apple iPhone 15 Pro కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు ఉన్న48 మెగాపిక్సెల్ (f/1.78) ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. 12-మెగాపిక్సెల్ (f/2.2, అల్ట్రా వైడ్ యాంగిల్) కెమెరా, 12-మెగాపిక్సెల్ (f/1.78) కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇది f/1.9 ఎపర్చర్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Also Read: ఐఫోన్ లాంటి ఫోన్.. రూ.6,500కే.. డబుల్ ధమాకా!

Apple iPhone 15 Pro iOS 17 ఆధారంగా రూపొందించబడింది. ఇందులో డ్యూయల్-సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఫోన్ బరువు 187.00 గ్రాములు. డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్షన్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi, GPS, బ్లూటూత్ v5.30, NFC, USB టైప్-C, 3G, 4G, LTE ఉన్నాయి.ఇది బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్స్‌లో అందుబాటులో ఉంది.

Related News

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Samsung M17 5G: శాంసంగ్ గెలాక్సీ M17 5G లాంచ్.. కేవలం రూ.11999కే అద్భుత ఫీచర్లు

Realme 15T: యూత్‌కి కొత్త క్రేజ్..7000mAh బ్యాటరీతో రియల్‌మీ 15T 5G మొబైల్ లాంచ్

ChatGPT UPI: చాట్‌జిపిటితో యుపిఐ పేమెంట్స్.. ఇక ఏఐ కామర్స్ ప్రారంభం

Redmi 200MP Camera: రూ15000కే 200MP కెమెరా ఫోన్.. రెడ్‌మీ లిమిటెడ్ ఆఫర్!

Farming: నారుమళ్లు, దుక్కి దున్నటాలకు గుడ్ బై, ఇక మట్టి లేకుండా వ్యవసాయం చేయ్యొచ్చు!

Big Stories

×