BigTV English

Ambati vs Alludu : అంబటికి అల్లుడి రివర్స్ కౌంటర్.. మరో బండారం బట్టబయలు

Ambati vs Alludu : అంబటికి అల్లుడి రివర్స్ కౌంటర్.. మరో బండారం బట్టబయలు

Gautam Another Video on Ambati Rambabu : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంబటి వర్సెస్ అల్లుడు రాజకీయం జరుగుతోంది. రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయనంత నీచుడు, నికృష్టుడు ఉండడని, అలాంటి వాడికి అల్లుడిని అయినందుకు సిగ్గుగా ఉందని గౌతమ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జీవితంలో మళ్లీ అలాంటి వ్యక్తిని కలవాలని అనుకోవడం లేదన్నాడు.


అల్లుడి వీడియోపై స్పందించిన అంబటి దానివెనుక పవన్, చంద్రబాబు, కన్నా ల హస్తం ఉందని ఆరోపించారు. అలాగే తన కూతురు, అల్లుడి విడాకుల కేసు నడుస్తుందని, ఫ్యామిలీ విషయాలను రాజకీయాలను వాడుకునేంతలా దిగజారిపోయారని విమర్శించారు.

మరోసారి అల్లుడు గౌతమ్.. అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా తన మనవడు, మనవరాలిని చూడనివ్వకుండా చేశారని వాపోయారు. రెండ్రోజుల క్రితం అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలు చెప్పారని, తన మామయ్య ఇంత మంచివాడా అని 2 నిమిషాలపాటు తానే నమ్మేశానన్నారు. నిజంగానే ఇసుమంత మంచితనం ఉంటే బాగుండేదన్నారు.


Also Read : అల్లుడి వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్.. పవన్ కల్యాణ్ నీకిది తగదు..

నాలుగేళ్లుగా తన మనవడు, మనవరాలు తనవద్దే ఉన్నారని, వారిని ఆర్థికంగా తానే చూసుకుంటానని చెప్పారన్నారు. అల్లుడిగా తాను ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదు కాబట్టి దుర్మార్గుడిని తానే అవుతానని చెప్పారన్నారు. తనవెనుక మోదీ, పవన్, చంద్రబాబు ఉండి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారని తెలిపారు. అయితే తాను చెప్పింది ఎంత నిజమో తెలియాలంటే ఒక వీడియో చూడాలని చెబుతూ.. 2023, మార్చి3న పంపిన తన తండ్రి వీడియోను చూపించారు.

అందులో గౌతమ్ తండ్రి.. తనకు మనవడు, మనవరాలిని చూడాలని ఉందని, వాళ్లని అర్జెంటుగా పంపాలని ఐసీయూలో ఉండి విజ్ఞప్తి చేసారు. ఆఖరి క్షణాల్లో తన తండ్రి వారసులను చూసుకోలేకపోయానని ఎంతో బాధపడ్డారని మీకు తెలుసా ? అని అంబటిని ప్రశ్నించారు. అంబటి వారి ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తే దుర్మార్గులవుతారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా న్యాయం చేస్తారని నమ్మి, విసుగెత్తి కోర్టుకు వెళ్తే దుర్మార్గుడిగా ముద్రవేశారన్నారు. తన కొడుకు, కూతురిని పోషించనక్కర్లేదని, మీడియా సాక్షిగా నేనే తీసుకెళ్తానని తెలిపారు. నాన్నగా నన్ను వాళ్లకు దూరం చేసి.. ఎలాంటి తప్పు చేయలేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×