E-Paper
Advertisement

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో
Advertisement

German Romantic Drama: రొమాన్స్, హైస్పీడ్ కార్ రేసింగ్ కలగలిస్తే ఆ మజానే వేరు. రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో ఒక ఫేక్ రిలేషన్‌షిప్‌లో అడుగు పెడితే ఏమవుతుంది ? ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన జర్మన్ రొమాంటిక్ డ్రామా ‘డ్రైవ్ ది ప్రిటెండర్స్’ (Drive The Pretenders). మరి ఈ అదిరిపోయే రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది అంటే…

కథలోకి వెళ్తే…

సారా జెంకిన్స్ కార్ మెకానిక్. కార్లంటే ఆమెకు పిచ్చి. ముఖ్యంగా రేసింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని కలలు కంటుంది. అయితే ఆమెకు అవకాశాలు మాత్రం అంత సులభంగా రావు. మరోవైపు డాంటే అన్నున్జియాటా ప్రముఖ రేసింగ్ స్టార్. ట్రాక్‌పై అతడి వేగానికి అభిమానులు ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు అతడి పేరుప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితుల్లో సారా, డాంటే జీవితాలు అనుకోకుండా ఒకదానితో ఒకటి ముడిపడతాయి. డాంటే ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి ఒక మార్గం అవసరమవుతుంది. అదే సమయంలో సారాకు కూడా రేసింగ్ ప్రపంచంలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం కావాలి. దీంతో ఇద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు.

Advertisement

బయట ప్రపంచం ముందు తాము నిశ్చితార్థం చేసుకున్న జంటగా నటించాలని నిర్ణయించుకుంటారు. ఈ ఫేక్ ఎంగేజ్‌మెంట్ తో డాంటే తనపై ఉన్న నెగెటివ్ అభిప్రాయాన్ని మార్చుకోవాలనుకుంటే, సారా తన కలకు దగ్గరయ్యేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. కానీ ఒకరి కోసం మరొకరు నటిస్తున్న క్రమంలో వారి మధ్య అనుబంధం పెరుగుతుంది. మొదట కేవలం ఒప్పందంగా మొదలైన ఈ సంబంధంలో క్రమంగా నిజమైన ప్రేమగా మారుతుంది. అయితే, అబద్ధం మీద నిర్మించిన ఈ బంధాన్ని ఎంతకాలం కొనసాగించగలరు ? తమ మధ్య పెరుగుతున్న ప్రేమను ఇద్దరూ అంగీకరించగలరా ? ఈ నాటకం బయటపడితే వారి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి ? అనేదే కథలో చూడాల్సిన ముఖ్యమైన అంశం.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘డ్రైవ్: ది ప్రిటెండర్స్’ (Drive – The Pretenders) జర్మన్ రొమాంటిక్ డ్రామా. లిసా-మేరీ కొరోల్ (Lisa-Marie Koroll), అమిన్ బాహ్మెద్ (Amin Baahmed) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సెర్జెయ్ మోయా (Sergej Moya) దర్శకత్వం వహించారు. తమరా లష్ (Tamara Lush) రాసిన పాపులర్ వాట్‌ప్యాడ్ నవల ‘డ్రైవ్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా అసలు భాష జర్మన్. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read Also: సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా

Related News

శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్‌ సంప్రదాయాన్ని చూశారా ?

స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్

యుద్ధభూమిలో చావును జయించిన మృత్యుంజయుడు… ముందుంది ముసళ్ల పండగ… హై-వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్

పిజ్జా షాప్‌లో పిచ్చి బాస్… ఈ కుర్రాళ్ల లైఫ్ చూస్తే మీ యంగ్ ఏజ్ గుర్తొస్తుంది భయ్యా… కొత్త కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×