E-Paper

వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!
Advertisement

WhatsApp: ఈ రోజుల్లో వాట్సప్ వాడని వారంటూ ఎవరూ లేరు. ఒక చిన్న మెసేజ్, ఫొటో లేదా వీడియోను క్షణాల్లో వందల మందికి చేరవేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇదే సమయంలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం కూడా అంతే వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని అరికట్టేందుకు వాట్సప్ కొన్ని కీలకమైన నిబంధనలను తీసుకువచ్చింది. మీరు కూడా తరచూ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తుంటే.. ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఫార్వర్డ్ లిమిట్ ఎంతంటే?

వాట్సప్ నిబంధనల ప్రకారం.. మీరు ఏదైనా ఒక మెసేజ్‌ను ఒకేసారి గరిష్టంగా ఐదు చాట్‌లు లేదా గ్రూపులకు మాత్రమే ఫార్వర్డ్ చేయగలరు. అంతకంటే ఎక్కువ మందికి పంపడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ మెసేజ్ ఇప్పటికే బాగా వైరల్ అయి ఉంటే, దానిపై Forwarded Many Times అనే లేబుల్ కనిపిస్తుంది. అలాంటి మెసేజ్‌లను మనం ఒకేసారి ఒకే ఒక్క చాట్‌కు మాత్రమే ఫార్వర్డ్ చేయగలం. వైరల్ వార్తలకు బ్రేక్ వేసేందుకే మెటా సంస్థ ఈ పరిమితిని విధించింది.

Advertisement

Also Read: షాకింగ్.. Google Pixel 10పై రూ.15 వేలకు పైగా తగ్గింపు.. ఈ ప్రైస్‌కి ఇప్పుడు కొనడం వర్తా?

మన మెసేజ్‌లను వాట్సప్ చదువుతుందా?

మనం పంపే ఫార్వర్డ్ మెసేజ్‌లను వాట్సప్ గమనిస్తుందా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ, వాట్సప్‌లో end-to-end encryptionటెక్నాలజీ ఉంటుంది. దీనివల్ల మెసేజ్ పంపిన వారికి, అందుకునే వారికి తప్ప మధ్యలో మరెవరికీ ఆ సమాచారం కనిపించదు. వాట్సప్ కేవలం ఆ మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయిందనే సంఖ్యను మాత్రమే ట్రాక్ చేస్తుంది తప్ప, అందులో ఏముందో చదవలేదు. కాబట్టి.. మీ వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.

మెసేజ్ ఫార్వర్డ్ కాకపోతే ఏం చేయాలి?

Advertisement

కొన్నిసార్లు పరిమితి దాటకపోయినా మెసేజ్‌లు ఫార్వర్డ్ కావు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం సాంకేతిక సమస్య కావచ్చు. దీనికోసం ముందుగా మీ ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేసి చూడండి. అలాగే మీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పాతదైనా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి కాబట్టి.. ఫోన్‌ను కూడా అప్‌డేట్ ఉంచడం మంచిది.

Also Read: Samsung Galaxy S26 ఫోన్‌కు One UI 9 అప్‌డేట్ విడుదల.. కొత్త AI ఫీచర్లు, కీలక మార్పులు ఇవే!

Related News

కరెంట్ సేవ్ చేస్తూ పవర్‌ఫుల్ కూలింగ్.. బెస్ట్ ఏసీల స్పెషల్ లిస్ట్

వినియోగదారుల కోర్టు మెుట్టికాయలు.. యాపిల్ దిగొచ్చింది.. ఐఫోన్ యూజర్ గెలిచాడు!

ఫోన్‌పే వాలెట్ యూజర్లకు అలర్ట్.. ఏడాది పాటు వాడకపోతే ఇక అంతే?

బరువు తగ్గాలా? టేస్ట్ తగ్గకూడదా? హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్లతో.. స్మార్ట్ కుకింగ్

సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

ఫ్రిడ్జ్‌లో ఈ పండ్లు పెడుతున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. షాకింగ్ నిజాలు!

బట్టలు ఉతకడంలో కొత్త ట్రెండ్.. ఇలా చేస్తే కరెంట్, టైం రెండూ ఆదా

ఒరిజినల్ నెంబర్ హైడ్.. డూప్లికేట్ నెంబర్‌తో రీఛార్జ్.. BSNL క్రేజీ టెక్నాలజీ!

Big Stories

×