BigTV English

PVP: కేశినేని.. కొవ్వు కరిగించు.. పీవీపీ పంచ్‌లు.. బెజవాడ పాలి..ట్రిక్స్

PVP: కేశినేని.. కొవ్వు కరిగించు.. పీవీపీ పంచ్‌లు.. బెజవాడ పాలి..ట్రిక్స్
kesineni pvp

AP Politics(Telugu news updates): టీడీపీ ఎంపీ కేశినేని నానికి పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో తనకి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని కేశినేని చేసిన వ్యాఖ్యలపై పీవీపీ స్పందించారు.


నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టుగా… అంటూ చురకలు అంటించారు పీవీపీ.

ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, ముంచేది బ్యాంకులను అని విమర్శించారు.


సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు.. అని ట్వీట్‌ చేశారు పీవీపీ.

పీవీపీ ట్వీట్ పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయింది. బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి గెలుస్తానన్నారు. తన ట్రాక్ రికార్డు అలాంటిదని.. తాను చేసినంత అభివృద్ధి దేశంలోకే ఏ ఎంపీ చేయలేదంటూ చెప్పుకొచ్చారు.

కేశినేని నాని ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో కలసి కనిపిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే.. అన్నారంటే, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ఫిక్స్ అయ్యారా? తనకు పోటీగా తన సోదరుడు కేశినేని చిన్నిని అధిష్టానం ఎంకరేజ్ చేస్తోందని హర్ట్ అయ్యారా? మరి, నాని వైసీపీ నుంచి బరిలో దిగుతారా? ఇదే డౌట్‌తో పీవీపీ అలర్ట్ అయినట్టున్నారు.

గత ఎన్నికల్లో కేశినేని నాని చేతిలో ఓడిపోయారు పీవీపీ. ఈసారి కూడా వైసీపీ తరఫున మరోసారి తలపడాలని భావిస్తున్నారు. ఇంతలోనే నాని టీడీపీలో రెబెల్ వాయిస్ వినిపిస్తుండటంతో.. ఎక్కడ వైసీపీలో చేరి తన టికెట్‌కు ఎసరు పెడుతారో అనేది పీవీపీ టెన్షన్‌లా కనిపిస్తోంది. అందుకే, నానిని గిల్లుతూ.. ట్విటర్‌లో స్పైసీ కామెంట్ పెట్టారంటున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×