Summer Energy Saving Tips: చలికాలంతో పోల్చితే ఎండాకాలం (Summer)లో కరెంటు వినియోగం(Electricity Usage) చాలా ఎక్కువగా ఉంటుంది. కరెంటు బిల్లులు (Electricity bills) కూడా విపరీతంగా వస్తాయి. ఫ్యాన్లు, కూలర్ల వినియోగంతో పోల్చితే ఏసీలు(AC) ఉపయోగించే వారికి కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుంది. అయితే, ఏసీ ఫుల్ గా వాడినా కరెంటు బిల్లు తక్కువగా రావాలంటే కొన్ని టిప్స్ (Low Electricity bill Tips) పాటించాలి. విద్యుత్ ను పొదుపుగా వాడుతూ కరెంటు బిల్లుల మోతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ తక్కువ కరెంటు బిల్లు రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎనర్జీ మినిస్ట్రీ కరెంటు బిల్లుల గురించి ఏం చెప్తుందంటే?
విద్యుత్ వినియోగంలో ఇంట్లో మోటార్లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని అవసరం ఉన్న మేరకు వాడితే కరెంటు బిల్లు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఉన్న గదిలోనే ఫ్యాన్లు లేదంటే కూలర్లు, ఏసీలు వినియోగించాలి. ఒకవేళ బయటకు వస్తే ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి విద్యుత్ బిల్లు తగ్గుతుంది. అవసరం ఉంటేనే ఆయా గదుల్లో ఫ్యాన్లు ఆన్ చేయాలి. లేదంటే ఆఫ్ చేయాలి. అవసరం మేరకు వినియోగించడం వల్ల కరెంటును తక్కువగా కాల్చి, కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు.
ఇంట్లో మోటార్లు ఎలా పొదుపుగా వాడాలి?
కరెంటు బిల్లు ఎక్కువగా రావడానికి గల కారణాల్లో నీటి మోటార్ ఒకటి. ఒకవేళ మీ మోటార్ ఎక్కువగా కరెంటును వినియోగిస్తే, అలారం బెల్ ను ఉపయోగించాలి. నీటి పంపును అవసరం మేరకు ఉపయోగించేలా ఈ అలారం సాయపడుతుంది. మోటార్లు సాధారణంగా చాలా కరెంటును తీసుకుంటాయి. ఎండా కాలంలో ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సో, ఇకపై సమ్మర్ లో విద్యుత్ మోటార్ వినియోగం పట్ల శ్రద్ధపెట్టాలి.
ఏసీని ఎలా ఉపయోగించాలంటే?
ఎండాకాలంలో ఏసీ ఎక్కువ కరెంటును వినియోగిస్తుంది. అవసరం ఉంటేనే ఏసీని వినియోగించాలి. నాన్-ఇన్వర్టర్ ACని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్వర్టర్ ACని ఉపయోగించడం వల్ల విద్యుత్ చాలా వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏసీలో కంప్రెసర్ సెలెక్షన్ అనేది చాలా కీలకం. ACలో కంప్రెసర్ సామార్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా విద్యుత్ ను వినియోగిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏసీ ఉపయోగిస్తున్నట్లు అయితే, వేసవికి ముందు సర్వీస్ చేయించండి. తరచుగా సర్వీస్ చేయించడం వల్ల డస్ట్ తొలగిపోయి గది ఈజీగా చల్లబడే అవకాశం ఉంటుంది. ఏసీ ఆన్ చేసే సమయంలో నెమ్మదిగా టెంపరేచర్ తగ్గించాలి. ఒకేసారి రిమోట్ లో టెంపరేచర్ తగ్గించడం వల్ల ఏసీ మీద అధికభారం పడి విద్యుత్ ఎక్కువగా ఉపయోగించుకుంది. గది చల్లగా మారిన తర్వాత ఏసీ ఆఫ్ చేయడం మంచిది. అవసరం మేరకు ఏసీని వినియోగించడం వల్ల కరెంటును ఆదా చేసి, తక్కువ కరెంట్ బిల్లును పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ తో మోదీ భేటీ.. భారత్ ఏఐ రంగాన్నే పెను మార్పులు తీసుకురానుందా!