Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసుకొని… దుమ్ము లేపాడు రోహిత్ శర్మ. టీమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. 76 బంతుల్లో… తన 32వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అది కూడా… భారీ సిక్స్ కొట్టి… విధ్వంసకర సెంచరీని అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్… ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.
Also Read: Ind vs Eng 2nd Odi: అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్… కరెంట్ బిల్లు కట్టలేదా ఏంటి?
76 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ… మొదటినుంచి దూకుడుగా ఆడాడు. తన ఇన్నింగ్స్ లో… ఇప్పటివరకు ఏడు సిక్సర్లు ఉన్నాయి. అలాగే తొమ్మిది బౌండరీలు కూడా కొట్టాడు రోహిత్ శర్మ. గత కొన్ని రోజులుగా… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… అత్యంత దారుణమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -2025 టోర్నమెంట్ నుంచి ఇప్పటివరకు… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత…. టి20 ఫార్మాట్ గుడ్ బై చెప్పాడు రోహిత్ శర్మ.
అయితే… కేవలం టెస్టులు అలాగే వన్డే మ్యాచ్లు ఆడుతున్న రోహిత్ శర్మ…. టి20 ప్రపంచ కప్ 2024 తర్వాత పెద్దగా రాణించలేదు. ఈ రెండు ఫార్మాట్లకు కూడా రోహిత్ శర్మను రిటైర్ కావాలని… చాలామంది అభిమానులు అలాగే క్రీడా విశ్లేషకులు డిమాండ్ చేశారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా… కసరత్తులు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం రంజి మ్యాచులు కూడా ఆడాడు. అక్కడ కూడా విఫలమైనప్పటికీ…. ఏ మాత్రం తగ్గలేదు రోహిత్ శర్మ. తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.భారత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు క్రికెట్ లవర్స్ కు బిగ్ గుడ్ న్యూస్ చెప్పాడు. అదే తాను ఫామ్ లోకి రావడం. ఫామ్ అందుకోవడమే కాదు సెంచరీ కొట్టి భారత్ ను ముందుకు నడిపించాడు.
కటక్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన సూపర్ హిట్టింగ్ ఆటతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. హిట్‌మన్ తన వన్డే కెరీర్‌లో 32వ సెంచరీని సాధించాడు. అలాగే, వన్డేల్లో తన రెండో వేగవంతమైన సెంచరీగా ఇది నిలిచింది. నెట్స్ లో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. ఈ తరుణంలోనే ఇవాల్టి ఇన్నింగ్స్… ద్వారా.. తన సత్తా ఏంటో నిరూపించాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండు బౌలర్లను ఊచ కోత కోచాడు… డేంజర్ ఆటగాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు కకావికలమయ్యారు. రోహిత్ శర్మ ఇంకా కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. సెంచరీ అయిన తర్వాత మరింత రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇంగ్లాండ్ బౌలర్లు ఆచితూచి బౌలింగ్ వేస్తున్నారు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థానే తోపు.. టీమిండియాకు చెత్త రికార్డులు.. ?
ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం 27.5 ఓవర్లలో 201 పరుగులు చేసింది టీమిండియా. ఇప్పటికే హాఫ్ సెంచరీ చేసిన గిల్ అవుట్ కాగా… విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడానికి మరో 14 పరుగులు చేస్తే సరిపోతుంది. రోహిత్ శర్మ దూకుడు చూస్తుంటే… మరో 30 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. రోహిత్ శర్మకు వన్డేల్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే..
63 బంతులు vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ 2023
76 బంతులు vs ఇంగ్లాండ్, కటక్ 2025
82 బంతులు vs ఇంగ్లాండ్, నాటింగ్‌హామ్ 2018
82 బంతులు vs న్యూజిలాండ్, ఇండోర్ 2023
84 బంతులు vs వెస్టిండీస్, గౌహతి 2018
सूरमा नहीं विचलित होते
क्षण एक नहीं धीरज खोते#RohitSharma pic.twitter.com/etiTFF8xcr— AT10 (@Loyalsachfan10) February 9, 2025