BigTV English

Best Selling Smartphones in Q3 2024 : గ్లోబల్ మార్కెట్లో తోపు ఇవే.. ఈ ఏడాది టాప్ 10లో నిలిచిన స్మార్ట్ ఫోన్స్ ఏవంటే!

Best Selling Smartphones in Q3 2024 : గ్లోబల్ మార్కెట్లో తోపు ఇవే.. ఈ ఏడాది టాప్ 10లో నిలిచిన స్మార్ట్ ఫోన్స్ ఏవంటే!

Best Selling Smartphones in Q3 2024 : ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అత్యధికంగా సేల్ అయిన మెుబైల్స్ జాబితాలో యాపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) మెుదటి స్థానంలో నిలిచింది. ఇక ఐఫోన్ 15 ప్రో మాక్స్(Apple iPhone 15 Pro Max), ఐఫోన్ 15 ప్రో(Apple iPhone 15 Pro) తర్వాత రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. దీంతో టెక్ రంగంలో యాపిల్ మరోసారి తన సత్తా చాటింది.


అత్యధికంగా అమ్ముడైన మొబైల్స్ జాబితాలో యాపిల్ మరోసారి తన సత్తా చాటిందనే చెప్పాలి. ఇక యాపిల్ తో పాటు సామ్ సాంగ్ సైతం మొదటి పది స్థానాల్లో ఐదు స్థానాలు కైవసం చేసుకొని తన స్థానాన్ని పదిలం పరుచుకుంది. Xiaomi నుంచి లాంఛ్ అయిన Redmi 13C 4G మోడల్‌ సైతం టాప్ 10లో ఒకటిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ ప్రీమియం, బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో మరోసారి నిరూపించాయి.

కౌంటర్‌పాయింట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ ర్యాంకింగ్స్ లో 2024 మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మొదటి పది స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఇదే.


1. Apple iPhone 15
2. Apple iPhone 15 Pro Max
3. Apple iPhone 15 Pro
4. Samsung Galaxy A15 4G
5. Samsung Galaxy A15 5G
6. Samsung Galaxy A35 5G
7. Samsung Galaxy A05
8. Apple iPhone 14
9. Xiaomi Redmi 13C 4G
10. Samsung Galaxy S24

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ తన సత్తా బలంగా చాటినప్పటికీ సామ్ సాంగ్ సైతం అదే స్థాయిలో తన పనితీరును నిరూపించిందనే చెప్పాలి. ఈ టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ జాబితాలో దాదాపు 19 శాతం సేల్స్  వినియోగదారులు కొత్త మోడల్స్ మొబైల్స్ కొనటానికే ఆసక్తి చూపించినట్లు తెలుస్తుంది.

మూడో త్రైమాసికంలో అమ్ముడైపోయిన మొబైల్స్ లో ఆపిల్ ఐఫోన్స్ లో ప్రో మోడల్స్ సగం వాటాను ఆక్రమించాయనే చెప్పాలి. నిజానికి దసరా, దివాళి సేల్స్ లో భాగంగా ఐఫోన్స్ పై ఆఫర్స్ అదిరిపోయే రేంజ్ లో దుమ్మురేపాయి. సేల్స్ లో బ్యాంక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ పైన కొనుగోలు సైతం అత్యధికంగా జరగడంతో ఆపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

సామ్ సాంగ్ గెలక్సీ s24 ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లో  అత్యధికంగా అమ్ముడైపోయిన మెుబైల్స్ లో మొదటి పది స్థానాల్లో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు పదిలంగా కాపాడుకుంటూ వచ్చింది.  సామ్ సాంగ్ సైతం ఈ మొబైల్లో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో డిజైన్ చేయడంతో పాటు వినియోగదారుడి అభిరుచికి తగినట్టు డిజైన్ చేయడంతో ప్రజాధారణ ఎక్కువగా కనిపించింది.

సామ్ సాంగ్ గాలక్సీ ఏ సిరీస్ సైతం తనదైన రీతిలో సత్తా చాటింది. ఈ సిరీస్ నుంచి లాంఛ్ అయిన మొబైల్స్ లో నాలుగు మోడల్స్ టాప్ 10 లిస్టులో ఉన్నాయి. దానితో పాటు సాఫ్ట్వేర్ అప్డేట్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ వినియోగదారుల్ని ఆకర్షించడంతో సామ్ సాంగ్ మోడల్ మెుబైల్స్ కు సైతం మంచి గిరాకీ కనిపించింది. ఇక టాప్ టెన్ మోడల్స్ లో ఆపిల్, సామ్ సాంగ్ తో పాటు గ్జియోమీ నుంచి లాంఛ్ అయిన రెడ్ మీ 13c 4g ( Xiaomi Redmi 13C 4G) మొబైల్ కూడా టాప్ టెన్ లో నిలిచింది.

 

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×