BigTV English

Happy Birthday CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డి బర్త్ డే.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, సీఎం చంద్రబాబు

Happy Birthday CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డి బర్త్ డే.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని,  సీఎం చంద్రబాబు

Happy Birthday CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు శుక్రవారం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బండి సంజయ్, సినీ నటుడు చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


వీరితోపాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, విపక్షలు నేతలు సైతం ముఖ్యమంత్రికి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్‌లో నేతలు కేక్ కట్ చేశారు. అభిమానులతో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.


జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల తో కలిసి కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, జీవన్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

ALSO READ: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

అంచెలంచెలుగా ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శమన్నారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సొంతం చేసుకున్నారని వివరించారు.

గృహ జ్యోతి కింద 200 యూనిట్లు, మహిళా కోసం 500 లకే సిలిండర్‌తో పాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు ఉద్యోగాలు భర్తీ కి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే 80 వేల పోస్టులు భర్తీ చేశారు.

ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి కల్పన కోసం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు.

 

 

 

 

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×