Friday OTT Movies: థియేటర్లలోకి ప్రతి వారం సినిమాలు ఎలా వస్తున్నాయో అలాగే ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేసిన సినిమాల కన్నా కూడా ఓటీటీలోకి కొత్తగా యాడ్ అయిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. సోమవారం రోజు 17 సినిమాలు రాబోతున్నాయని తెలిసింది. కానీ ఇప్పుడు మరో 5 మూవీస్ సడెన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర కూడా ఉంది. ఇంకా ఏ సినిమాలు వచ్చి యాడ్ అయ్యాయో? ఎక్కడ వాటిని చూడొచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్..
సిటాడెల్: హనీ బన్నీ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 7
వేట్టయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- నవంబర్ 8
గొర్రె పురాణం (తెలుగు మూవీ)- నవంబర్ 8
లుక్ బ్యాక్ (జపనీస్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 8
అలెక్స్ రైడర్ సీజన్ 1-3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
నెట్‌ఫ్లిక్స్..
దేవర (తెలుగు సినిమా)- నవంబర్ 8
విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)- నవంబర్ 8
ది బకింగ్ హమ్ మర్డర్స్ (హిందీ చిత్రం)- నవంబర్ 8
బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ది కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
ఉంజోలో: ది గాన్ గర్ల్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 8
జర్నల్ రైసా బై రైసా సరస్వతి- నవంబర్ 8
ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 9
ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 9
లయన్స్ గేట్ ప్లే..
అఫ్టర్‌మత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 8
ఫాక్స్‌క్యాచర్ (హాలీవుడ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 8
ది కరెంట్ వార్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 8
ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 8
చీఫ్ ఆఫ్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ చిత్రం)- వీఆర్ ఓటీటీ – నవంబర్ 8
క్వాబోన్ కా జమెలా (హిందీ సినిమా)- జియో సినిమా ఓటీటీ- నవంబర్ 8
జనక అయితే గనక (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 8
ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ (స్వీడిష్ ఫిల్మ్)- బుక్ మై షో- నవంబర్ 8
ఈరోజు శుక్రవారం ఒక్కరోజునే ఓటీటీలోకి ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతోపాటు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలు వేట్టయాన్, ఏఆర్ఎమ్, జనక అయితే గనక ఉన్నాయి. ఇవే కాకుండా కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది బకింగ్ హమ్ మర్డర్స్, దాంతో పాటుగా విజయ్ 69 మూవీస్ ఉన్నాయి. ఈ ఏడు సినిమాలు చాలా స్పెషల్ అని చెప్పాలి. వీటితో పాటుగా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.