Adjustable Shelves Refrigerators: ఇంట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా.. పండగలు, ఫంక్షన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు, కేక్ బాక్సులు లేదా పొడవాటి బాటిల్స్ పెట్టడానికి స్పేస్ చాలక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఫ్రిడ్జ్ లోపల సామాన్లు గజిబిజిగా ఉంటే గాలి సరిగ్గా తగలక ఫుడ్ కూడా త్వరగా పాడైపోతుంది. ఈ ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషనే అడ్జస్టబుల్ షెల్వ్స్ రిఫ్రిజిరేటర్లు. మీ అవసరానికి తగ్గట్టుగా లోపల స్పేస్‌ను మార్చుకునే.. ఫ్లెక్సిబిలిటీని ఇవి ఇస్తాయి. కస్టమర్లు మోస్ట్ పాపులర్ గా రేట్ చేసిన టాప్ 5 అడ్జస్టబుల్ షెల్ఫ్ రిఫ్రిజిరేటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం కూలింగ్ మాత్రమే కాదు.. ఫ్రిడ్జ్ లోపల స్పేస్ మేనేజ్మెంట్ ఎలా ఉందనే దానిపైనే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడ్జస్టబుల్ షెల్వ్స్ లేదా ఫ్లెక్సిబుల్ షెల్వ్స్ ఉన్నప్పుడు లోపల ఎయిర్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. దీని వల్ల ప్రతీ మూలా సమానంగా కూల్ అయ్యి, కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. బ్యాక్టీరియా చేరకుండా.. ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండాలంటే.. స్మార్ట్ ఆర్గనైజేషన్ ముఖ్యం.
శామ్‌సంగ్ 3-స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్:
శామ్‌సంగ్ బ్రాండ్ ఎప్పుడూ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ముందుంటుంది. ఈ మోడల్‌లో స్పెషల్ గా ఇచ్చిన ‘స్లైడ్ అండ్ ఫోల్డ్’ షెల్ఫ్ ఒక సూపర్ ఫీచర్. మీకు పెద్ద గిన్నెలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ షెల్ఫ్‌ను వెనక్కి మడతపెట్టేయవచ్చు లేదా సగం వరకు స్లైడ్ చేయవచ్చు. దీని వల్ల కింద ఉన్న రాక్‌లో డబుల్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీతో రావడం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది.
ఎల్‌జీ డబుల్ డోర్ స్మార్ట్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్:
ఎల్‌జీ రిఫ్రిజిరేటర్లలోని ‘పుల్ అవుట్ ట్రే’, అడ్జస్టబుల్ టఫెండ్ గ్లాస్ షెల్వ్స్ కిచెన్ ఆర్గనైజేషన్‌ను చాలా ఈజీ చేస్తాయి. ఫ్రిడ్జ్ వెనక భాగంలో ఉన్న వస్తువులను కూడా ఈజీగా తీసుకోవడానికి ఈ పుల్ అవుట్ ట్రే హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న మల్టీ ఎయిర్ ఫ్లో సిస్టమ్, అడ్జస్టబుల్ షెల్వ్స్ కాంబినేషన్ వల్ల ఆహార పదార్థాల తాజాదనం వారం రోజుల పైనే చెదరకుండా ఉంటుంది.
వర్ల్‌పూల్ ఇంటెల్లిఫ్రెష్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్:
వర్ల్‌పూల్ తన ‘ఫ్లెక్సి-స్పేస్’ మేనేజ్‌మెంట్‌తో మార్కెట్ లో మంచి రేటింగ్ సంపాదించింది. ఇందులో షెల్వ్స్‌ను పైకి, కిందకి మనకు నచ్చిన స్లాట్ లోకి చాలా సులభంగా మార్చుకోవచ్చు. బాటిల్ రాక్స్ కూడా అడ్జస్టబుల్ ఆప్షన్ తో వస్తాయి కాబట్టి, పెద్ద లీటర్ బాటిల్స్ ను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్దుకోవచ్చు. జియోలైట్ టెక్నాలజీ కూరగాయలు కుళ్ళిపోకుండా కాపాడుతుంది.
Also Read: బట్టలు ఉతకడం ఇక చిటికెలో పని.. బెస్ట్ 8 కేజీ వాషింగ్ మెషీన్స్!
గాడ్రెజ్ ఎడ్జ్ పెంటాకూల్ రిఫ్రిజిరేటర్:
బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ ఆర్గనైజేషన్ స్పేస్ ఇచ్చే ఇండియన్ బ్రాండ్ గాడ్రెజ్. ఇందులో ఇచ్చిన అడ్జస్టబుల్ టఫెండ్ గ్లాస్ షెల్వ్స్ దాదాపు 150 కేజీల బరువును కూడా మోయగలవు. పెద్ద పెద్ద బిర్యానీ గిన్నెలు లేదా వాటర్ మెలన్ లాంటి పండ్లను దాచడానికి ఈ షెల్వ్స్ పొజిషన్ మార్చుకుంటే సరిపోతుంది. థిక్ ఇన్సులేషన్ వల్ల పవర్ కట్ అయినా కూలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది.
హాసియర్ బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్:
ఫ్రిడ్జ్ పైభాగంలో.. ఫ్రీజర్ కింది భాగంలో ఉండే ఈ లేటెస్ట్ ట్రెండ్ మోడల్ లో హాసియర్ అద్భుతమైన స్పేస్ మేనేజ్మెంట్ ఇచ్చింది. ఇందులో ఉండే ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు లోపల షెల్వ్స్ ను పూర్తిగా రిమూవ్ చేసుకునే లేదా అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. తరచూ ఫ్రిడ్జ్ వాడేవారికి వంగాల్సిన అవసరం లేకుండా.. వస్తువులను పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది.