E-Paper
Advertisement

ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్మార్ట్ ఫీచర్స్.. జెన్ Z కోసం టాప్ 5 స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్మార్ట్ ఫీచర్స్.. జెన్ Z కోసం టాప్ 5 స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Best Futuristic Electric For Gen Z: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా జెన్ Z  కొనుగోలుదారులు స్టైలిష్ లుక్, స్మార్ట్ టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లు, సరసమైన ధరతో కూడిన వెహికల్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వాహన తయారీ సంస్థలు యువతను ఆకట్టుకునేలా క్రేజీ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో జెన్ Z వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1.ఎంజీ కామెట్ EV

ఈ లిస్టులో మొదటి స్థానంలో ఎంజీ కామెట్ EV ఉంది. చిన్న పరిమాణం, ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌ తో ఈ కారు యువతకు బాగా నచ్చుతోంది. సిటీ ట్రాఫిక్ మధ్య సులభంగా నడపడానికి అనువుగా రూపొందించారు. ఈ కారులో 17.3 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెండు డిజిటల్ స్క్రీన్లు, వైర్‌ లెస్ కనెక్టివిటీ, లెదరెట్ సీట్లు, 55కు పైగా స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

2.టాటా టియాగో EV

Advertisement

టాటా టియాగో EV యువతలో మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ కారు కొత్త డిజైన్‌ తో మార్కెట్లోకి వచ్చింది. LED హెడ్‌ ల్యాంప్స్, కొత్త బంపర్, ఆధునిక స్టైలింగ్ తో ఆకట్టుకుంటుంది. 24 kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 285 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌ బ్యాగ్స్, డ్యూయల్ వైర్‌ లెస్ ఛార్జింగ్లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

3.సిట్రోయెన్ eC3X

సరసమైన ధరలో ఎలక్ట్రిక్ SUV కోరుకునే వారికి సిట్రోయెన్ eC3X మంచి ఆప్షన్ కానుంది. ఈ కారు సౌకర్యం, టెక్నాలజీ, అందుబాటు ధరలో అందిస్తోంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 57 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌ తో సుమారు 325 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు యువతను ఆకర్షిస్తున్నాయి.

4.మహీంద్రా BE 6

Advertisement

ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ తో రూపొందించిన మహీంద్రా BE 6 ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఆధునిక ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి. ఈ కారు 600 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో లెవెల్-2 ADAS, ఆటో పార్క్ అసిస్ట్, డిజిటల్ కాక్‌ పిట్, డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్, భారీ డిస్‌ ప్లేలు లాంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీని ఇష్టపడే యువతకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

5.హ్యుందాయ్ ఐయోనిక్ 5

హ్యుందాయ్ ఐయోనిక్ 5 భారత మార్కెట్లో అత్యంత ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. దీని ప్రత్యేకమైన డిజైన్, పిక్సెల్ LED లైటింగ్, లగ్జరీ క్యాబిన్ దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. 84 kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 690 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ కీ, హెడ్ అప్ డిస్‌ ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read Also: సియెర్రా To అవిన్యా.. టాటా నుంచి 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

కియా To హ్యుందాయ్.. ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 5 క్రేజీ కార్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!

అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి గ్రాండ్ విటారా.. ఏకంగా 4 లక్షల యూనిట్లు సేల్!

హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్‌లోకి అడుగు పెట్టేదెప్పుడంటే?

కియా నుంచి క్యూట్ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్.. మార్కెట్లో ఇప్పుడు ఇదే నెంబర్ వన్, ఎందుకంటే?

2 గంటల్లో ఛార్జ్.. 260 కి.మీ రేంజ్.. అదిరిపోయే అవోర్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. జూలై 2026లో టాప్ సెల్లింగ్ కారు ఇదే!

బజాజ్ పల్సర్ N160 లాంచ్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Big Stories

Advertisement
×