Jio Airtel Excitel 300 Mbps plans: నేటి డిజిటల్ యుగంలో.. ఇంటర్నెట్ అనేది మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగమైపోయింది. ఆఫీస్ మీటింగ్‌లు, 4కే మూవీ స్ట్రీమింగ్, హెవీ ఫైల్ డౌన్ లోడ్స్ వంటి వాటికి సాధారణ బ్రాడ్ యాండ్ సరిపోదు. అందుకే.. సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ కోసం ఎక్కువ మంది 300 Mbps స్పీడ్ ప్లాన్లను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో ట్రెండ్‌లో.. ఉన్న జియో ఫైబర్ , ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ , ఎక్సిటెల్ అందించే 300 Mbps ప్లాన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జియో అందించే 300 Mbps ప్లాన్ కస్టమర్ల మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ హై-స్పీడ్ డేటాతో పాటు (FUP వర్తిస్తుంది), వాయిస్ కాల్స్ సౌకర్యం లభిస్తుంది. దీని అసలు మ్యాజిక్ అంతా ఓటీటీ బెనిఫిట్స్‌లోనే ఉంది! నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో , డిస్నీ+ హాట్‌స్టార్ సహా డజన్ల కొద్దీ ప్రముఖ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. మీరు ఎంటర్ టైన్‌మెంట్ లవర్ అయితే.. జియో ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
కనెక్టివిటీకి, స్పీడ్‌కు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ పెట్టింది పేరు. ఎయిర్‌టెల్ అందించే 300 Mbps ప్లాన్ ప్రొఫెషనల్స్ , గేమర్స్‌ని టార్గెట్ చేస్తుంది.ఇందులోనూ.. అన్లిమిటెడ్ ఇంటర్నెట్‌తో పాటు ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ తో.. పాటు వివిధ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ఛానెల్స్ యాక్సెస్ లభిస్తుంది.అంతేకాకుండా..ఎయిర్‌టెల్ వైఫై రౌటర్ పర్ఫామెన్స్ , కస్టమర్ సర్వీస్ చాలా వేగంగా ఉంటుందని యూజర్లు చెబుతుంటారు.
తక్కువ బడ్జెట్‌లో .. ఎక్కువ స్పీడ్ కోరుకునే వారికి ఎక్సిటెల్ ఒక అద్భుతమైన ఆప్షన్. జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే.. ఎక్సిటెల్ అందించే 300 Mbps ప్లాన్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లాంగ్-టర్మ్ ప్లాన్లు (3 నెలలు, 6 నెలలు లేదా ఏడాది) తీసుకునే వారికి ఎక్సిటెల్ రూపాయికి తగిన విలువ ఇస్తుంది. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకుండా ట్రూ అన్లిమిటెడ్ డేటాను అందిస్తుండటంతో.. బడ్జెట్ యూజర్లు ఈ ప్లాన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో .. దీని సర్వీస్ అందుబాటులో ఉందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి.
Also Read: ఏసీని ఎలా ఆఫ్ చేయాలి? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
మీరు ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లను విపరీతంగా చూసేవారైతే.. జియో 300 Mbps ప్లాన్ మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది.
ఎలాంటి లాగ్ లేని గేమింగ్, పర్‌ఫెక్ట్ ఆఫీస్ వర్క్, బెస్ట్ కస్టమర్ సపోర్ట్ కావాలంటే.. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వైపు వెళ్లొచ్చు.
తక్కువ బడ్జెట్‌లో సూపర్ హై-స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కావాలనుకుంటే మాత్రం.. ఎక్సిటెల్ బెస్ట్ ఆప్షన్.
జియో, ఎయిర్‌టెల్, ఎక్సిటెల్ మూడు కంపెనీలు అందిస్తున్న.. 300 Mbps ప్లాన్లు తమకంటూ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్ , మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ స్ట్రాంగ్‌గా ఉందో చూసుకొని సరైన ప్లాన్‌ను ఎంచుకోండి. హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో మీ డిజిటల్ లైఫ్‌ను మరింత ఈజీ చేసుకోండి!