Best 5G smartphone under 10000 : ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. కస్టమర్స్ ఎగబడి కొంటూ ఉంటారు. ఇక ఈ డిమాండ్ తో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి.ప్రముఖ టెలీకాం సంస్థలన్నీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చాక ఇంటర్నెట్ సేవలు వినియోగం మరింత పెరిగింది. గత కొంత కాలం వరకు 4G సేవలు విస్తృతంగా విస్తరించినప్పటికీ ప్రస్తుతం 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 5G స్మార్ట్ ఫోన్స్ ను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం అతి తక్కువ ధరలోనే 5G స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.10,000 కంటే తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్ తో 5G స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ తో పాటు ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సామ్ సాంగ్, వివో, మోటోరోలా, ఐక్యూ, లావా ఇప్పటికే అందుబాటు ధరల్లోనే 5G స్మార్ట్ ఫోన్స్ ను తీసుకువచ్చాయి. ఇందులో ఫీచర్స్ బట్టి స్మార్ట్ ఫోన్స్ రూ. 10,000 కంటే తక్కువ ధరలోనే అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
ALSO READ : రూ. 15వేలలోపే రియల్ మీ స్మార్ట్ ఫోన్స్.. అదిరే ఫీచర్స్ లో టాప్ 5 ఇవే
సామ్ సాంగ్ గెలాక్సీ A4 5G(Samsung galaxy a14 5C) – సామ్ సాంగ్ నుంచి లాంఛ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే ను కలిగి ఉంది. యాక్సినోస్ 1330 చిప్ సెట్ తో పనిచేసే ఈ మొబైల్లో 50mp + 2MP + 2 mp కెమెరాలతో పాటు 13MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. 5000mah బ్యాటరీ అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 4GB + 64GB స్టోరేజ్ ధర రూ. 8999 గా ఉంది. 4GB + 128GB స్టోరేజ్ ధర రూ. 9999గా ఉంది. అదే 6GB + 128GB స్టోరేజ్ ధర రూ.10999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లైట్, గ్రీన్, బ్లాక్, డార్క్ రెడ్ కలర్స్ లో అందుబాటులో ఉంది.
రెడ్ మీ 13c 5G(Vivo t3 light 5G) – ఈ స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాలు ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమన్ సిటీ 6100తో పనిచేసే ఈ మొబైల్ లో 50 MP + 2MP కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ఫోన్ 5000mah బ్యాటరీతో పని చేస్తుంది. 4GB + 128GB స్టోరేజ్ ధర రూ. 9199గా ఉంది. అదే 6GB + 128GB స్టోరేజ్ ధర రూ.10999గా ఉంది. 8GB + 256GB స్టోరేజ్ ధర రూ. 12999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ గ్రీన్ బ్లాక్ సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉంది
వివో t3 లైట్ 5G(Redmi 13 c 5G) – ఈ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాలు ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్ సిటీ 6300 SOC చిప్ సెట్ తో పనిచేసే ఈ మొబైల్ వెనుకవైపు 50 MP + 2 MP కెమెరా అందుబాటులో ఉంది. ఇక 8Mp సెల్ఫీ కెమెరా సైతం ఈ స్మార్ట్ ఫోన్లో ఉంది. ఫ్లిప్కార్ట్ లో 4GB + 128GB స్టోరేజ్ ధర రూ. 10499 గా ఉంది. అదే 6GB + 128 Gb స్టోరేజ్ ధర రూ. 10999గా ఉంది.