Telecom Network: దేశంలో మొబైల్ వినియోగదారులకు ఉపయోగపడే వార్త వచ్చేసింది. ఇదివరకు మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉందో తెలియక ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండడం, కాల్స్ డ్రాప్ వంటి ఇబ్బందులు యూజర్లకు ఎదురయ్యేవి. కానీ ఇకపై మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ట్రాయ్ ఆదేశం ప్రకారం దేశంలో టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా తమ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను వారి అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి తెచ్చాయి. దీంతో సులభంగా మీ ప్రాంతంలోని సిమ్ నెట్‌వర్క్ గురించి తెలుసుకోవచ్చు.
నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌ల అవసరం ఎందుకు?
ప్రస్తుతం మొబైల్ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నా కూడా నెట్‌వర్క్ స్థిరత్వం, ఇంటర్నెట్ వేగం, కాల్స్ కనెక్ట్ కావడం వంటి అంశాలు ఇబ్బందిగా మారుతాయి. దేశంలో, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు నెట్‌వర్క్ విభిన్నంగా ఉంటుంది. వినియోగదారులు తగిన సమాచారంతో నెట్‌వర్క్ ఎంపిక చేసుకోవాలంటే, వారికి ముందుగా వారి ప్రాంతంలో అందుబాటులో ఉన్న సేవల గురించి తెలియాలి. ఈ కవరేజ్ మ్యాప్‌లు వినియోగదారులకు తమ ప్రాంతంలో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలియజేస్తాయి. ఇలా చేయడం ద్వారా వారు తమ ప్రాంతంలో ఉన్ననెట్‌వర్క్ సేవలను ఈజీగా వినియోగించుకోవచ్చు.
TRAI ఆదేశాలతో టెలికాం కంపెనీల తాజా చర్యలు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల మొబైల్ క్యారియర్‌లు తమ జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ద్వారా వినియోగదారులు ముందుగా తమ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో పరిశీలించుకొని, తగిన నిర్ణయాన్ని తీసుకునే వీలు కలుగుతుంది.
ఎయిర్‌టెల్ (Airtel)
ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో “Check Coverage” సెక్షన్ ద్వారా తమ ప్రాంతంలోని నెట్‌వర్క్ స్థితిని చూడవచ్చు. ఇది 2G, 3G, 4G, 5G సేవలను చూపించేలా రూపొందించబడింది.
Read Also: Sony TV Offer: సోనీ 55 ఇంచ్ స్మార్ట్ HD టీవీపై రూ. 42 వేల .
జియో (Jio)
జియో కూడా “Coverage Map” అనే ప్రత్యేక పేజీని వారి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ సేవలను తెలుసుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియా (Vi)
వొడాఫోన్ ఐడియా వినియోగదారులు “Network Coverage” అనే విభాగాన్ని వారి వెబ్‌సైట్ ఫుటర్‌లో చూసి, తమ ప్రాంతంలోని నెట్‌వర్క్ స్థితిని తెలుసుకోవచ్చు.
ఈ మార్పులో వెనుకబడి
ఇప్పటికి BSNL మాత్రం తన కవరేజ్ మ్యాప్‌ను అందుబాటులోకి తేలేదు. అయితే, భవిష్యత్తులో ఇది కూడా TRAI మార్గదర్శకాలను పాటించే అవకాశముంది. వినియోగదారులు BSNL సేవలను ఉపయోగించడానికి ముందు, వారి ప్రాంతంలో నెట్‌వర్క్ లభ్యతను ఇతర మార్గాల ద్వారా ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కొత్త మార్పుతో వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు
-వినియోగదారులు ముందుగా తమ ప్రాంతంలోని నెట్‌వర్క్ గురించి తెలుసుకొని, సరిగ్గా పనిచేసే సేవను ఎంచుకోవచ్చు.
-మంచి నెట్‌వర్క్ ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలో వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందవచ్చు
-స్థిరమైన నెట్‌వర్క్ ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల కాల్స్ డ్రాప్ అయ్యే సమస్య తగ్గుతుంది.
-కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేయడానికి ముందు వినియోగదారులు ఆపరేటర్‌ను పరిశీలించి, మంచి సేవ అందించగలిగిన కంపెనీని ఎంచుకోవచ్చు