Mehar Ramesh – Ishan Kishan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2024 సీజన్ లో చివరి వరకు పోరాడి.. తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈ సీజన్ లో బరిలోకి దిగింది. ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా పటిష్టమైన జట్టును తయారు చేసుకుంది హైదరాబాద్. ఈ సీజన్ లో బరిలోకి దిగి తొలి మ్యాచ్ లోనే రెచ్చిపోయారు హైదరాబాద్ బ్యాటర్లు.
Also Read: PBKS VS LSG: లక్నో బౌలర్ ఓవరాక్షన్..పంజాబ్ వడ్డీతో తిరిగిఇచ్చేసింది ?
గత సీజన్ లో బౌలర్లను ఎలా చీల్చి చెండాడారో.. ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో కూడా అదే విధంగా ఆడారు. ముఖ్యంగా తొలి మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ డైనమేట్ ఇషాన్ కిషన్ మంచి ఫైర్ మీద కనిపించాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తించాడు. 2024 ఐపీఎల్ లో పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషన్ ని.. సన్రైజర్స్ హైదరాబాద్ మెగా వేలంలో దక్కించుకుంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఢీ కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287/3. ఇది సన్రైజర్స్ నమోదు చేసిన రికార్డు. అయితే తన రికార్డును తానే బ్రేక్ చేసే అవకాశాన్ని సన్రైజర్స్ చేజార్చుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో అజయంగా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్.. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ని ఉద్దేశించి {Mehar Ramesh – Ishan Kishan} కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే ఆ తరువాత హైదరాబాద్ జట్టు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఇషాన్ కిషన్ తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ ట్వీట్ కారణంగానే ఇషాన్ కిషన్ డౌన్ ఫాల్ మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. మెహర్ రమేష్ దెబ్బకి ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్ లో కూడా రాణించడం లేదని అంటున్నారు. అయితే తెలుగులో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకొని దర్శకుడిగా ఆయన పేరిట ఓ చెత్త రికార్డు ఉంది.
Also Read: Ashwani Kumar: ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు ముంబైని ఏలుతున్నాడు !
అతడు చేసిన సినిమాలన్నీ పెద్ద స్టార్ హీరోలతోనే చేశాడు. కానీ ఆశించినంత విజయం దక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా సక్సెస్ మాత్రం ఆయనకి అందని ద్రాక్షలా మారిపోయింది. చివరగా మెహర్ తీసిన “బోళా శంకర్” సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇక అప్పటినుండి సైలెంట్ గా ఉన్న ఈ దర్శకుడు.. అప్పుడప్పుడు ఇలా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఇషాన్ కిషన్ పై చేసిన పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు.