China Fastest Train CR450: రైల్వే రంగంలో చైనా సంచనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే అత్యాధునిక హైస్పీడ్ రైళ్లను కలిగి ఉన్న డ్రాగన్ కంట్రీ.. మరో సరికొత్త రైలును రూపొందించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలును ఆవిష్కరించింది. ఈ రైలు గంటకు 400 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. రీసెంట్ గానే ఈ రైలును బీజింగ్ లో అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం చైనాలో గంటకు 350 కిలో మీటర్ల వేగంతో CR400 ఫక్సింగ్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిని తలదన్నేలా CR450 రైలు రెడీ అయ్యింది. ఇప్పటి వరకు తయారు చేసిన రైళ్లతో పోల్చితే ఈ రైలు మరింత తేలికగా ఉంటుంది. అంతేకాదు, ఈ డిజైన్ 20 శాతానికి పైగా తక్కువ పవర్ ను తీసుకుంటుంది. CR450AF, CR450BF అనే రెండు ప్రోటో టైప్‌లలో ఎనిమిది కార్లు ఉన్నాయి. వీటి నిర్మాణంలో వాటర్ కూల్డ్, పర్మనెంట్ మాగ్నెట్ ట్రాక్షన్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.
అద్భుతమైన ఫీచర్లు
CR450 రైలు పెద్ద క్యాబిన్లు, సౌండ్ ప్రూఫ్, సైకిళ్లు, వీల్‌చైర్లను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ (47,000 కి.మీ) కలిగిన చైనా.. ఈ అత్యాధునిక రైలుతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. బీజింగ్ నుంచి షాంఘై చేరుకోవడానికి ప్రస్తుతం ప్రయాణ సమయంతో పోల్చితే సుమారు 4 గంటలు తగ్గనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
చైనా లేటెస్ట్ రైలు డిజైన్
CR450 మెరుగైన వేగం, శక్తి సామర్థ్యం కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. CR400 సిరీస్ లో భాగంగానే ఈ రైలును రూపొందించారు.
ఏరోడైనమిక్స్: ఈ రైలు నిర్మాణం గాలి నిరోధకతను తగ్గించడంతో పాటు వేగాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది.
లైట్ వెయిట్ పదార్థాలు: ఈ రైలు గత ఫాస్టెస్ట్ రైళ్లతో పోల్చితే సుమారు 10 శాతం తేలికగా ఉంటాయి. దీని తయారీలో కార్బన్ ఫైబర్, అల్యూమినియం వినియోగించారు. తక్కువ శక్తితో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది.
శక్తి సామర్థ్యం: మెరుగైన ట్రాక్షన్ వ్యవస్థలు గత మోడళ్లతో పోలిస్తే 20 శాతం వేగాన్ని పెంచుతాయి.
CR450 ఇంటీరియర్ ఫీచర్లు
CR450 ప్రయాణీకుల సౌకర్యం కోసం నాలుగు రకాల సీటింగ్ తరగతులను అందిస్తుంది. అవేంటంటే..
బిజినెస్ క్లాస్: విశాలమైన సీటింగ్ తో 2-2 కాన్ఫిగరేషన్ లో లెదర్ సీట్లను కలిగి ఉంటుంది.
ప్రీమియం ఫస్ట్ క్లాస్: మెరుగైన విశ్రాంతి కోసం పెద్ద ఫుట్ రెస్ట్ లను అందిస్తుంది.
ఫస్ట్ క్లాస్: అదనపు సౌకర్యాలతో 2-2 లేఅవుట్ లో అమర్చబడిన లెదర్ సీట్లతో రూపొందించబడింది.
సెకెండ్ క్లాస్: 2-3 కాన్ఫిగరేషన్ లో బేసిక్ చైర్లను కలిగి ఉంటుంది.
Read Also: అమెరికాలో అద్భుతమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కాకండి!
టెస్టింగ్ దశలో CR450
CR450 ప్రోటోటైప్ రైలు అందుబాటులోకి రావడానికి ముందు భద్రత, పనితీరు ప్రమాణాలకు సంబంధించి పరీక్షలను జరుపుకుంటున్నది. 2030 నాటికి చైనా తన హై స్పీడ్ రైలు నెట్ వర్క్ ను 48,000 కిలోమీటర్ల నుంచి 60,000 కిలోమీటర్లకు విస్తరించాలని టార్గెట్ గా పెట్టుకుంది.
Read Also: భారత్ నుంచి ఆ అందాల లోకానికి కొత్త రైల్వేలైన్, ఎన్ని లాభాలో తెలుసా?