Twist In Lady Aghori Gender: అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి.. ఇదేదో సినిమా పేరు అనుకోవద్దు. నిజజీవితంలో ఒక్కరికే రెండు లింగభేదాలు నిర్ధారిస్తూ దృవీకరించిన వైనమిది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో అనుకోవద్దు. రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిచయం అవసరం లేని లేడీ అఘోరీ అలియాస్ శీను. ఇటీవల తన కామెంట్స్ తో సంచలనంగా మారిన లేడీ అఘోరీకి సంబంధించి ఓ వాస్తవం వెలుగులోకి వచ్చింది. అదే అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన లేడీ అఘోరీ గత 8 నెలలుగా నిత్యం వార్తల్లో నిలవాల్సిందే. లేడీ అఘోరీ గురించి పలుమార్లు పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరేమో లేడీ అఘోరీ కాదని విమర్శిస్తే, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. అఘోరీ ముందుగా వస్త్రధారణ పాటించక పోవడంతో వివాదాలు చుట్టుముట్టాయి. ఆలయాల సందర్శనకు వెళ్లిన సమయంలో వస్త్రధారణ పాటించలేదని అనుమతి నిరాకరణ, ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో నేరుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటనలు కూడా జరిగాయి.
ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో పోలీసులకు, లేడీ అఘోరీకి వాగ్వివాదం సాగేది. పలు సంచలన ప్రకటనలతో అఘోరీ నిత్యం వార్తల్లో నిలవాల్సిందే. సోషల్ మీడియా పేజీల ద్వారా తన వీడియోలను విడుదల చేస్తూ, తనకంటూ క్రేజ్ ను లేడీ అఘోరీ సాధించుకున్నారని చెప్పవచ్చు. ఇటీవల వస్త్రధారణ పాటిస్తున్న అఘోరీ, ఏపీలో పర్యటిస్తున్నారు. తణుకులో అఘోరా రాజేష్ నాథ్ ఆశ్రమం వద్ద ఓ యువతికి అండగా నిలవడం, అలాగే గుంటూరుకు చెందిన హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహరా పై విమర్శలు చేసి, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఓ యువతి మాట్లాడడం, అందుకు అఘోరీ ప్రతిస్పందించడం వంటి మాటలు అందులో ఉన్నాయి. ఇంతకు ఆ ఆడియో వాస్తవమా లేక ఎవరైనా మిమిక్రీ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆడియో వైరల్ పై అనిల్ బెహరా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. లేడీ అఘోరీ కాదని కేవలం శివ అని పిలవాలన్నారు. ఇలాంటి వారి వల్ల సనాతన ధర్మ పరిరక్షణ చర్యలకు చెడ్డపేరు వస్తుందని, వెంటనే పోలీసులు కట్టడి చేయాలని కోరారు. ఆ సమయంలో లేడీ అఘోరీ కాదనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా వెల్లడించారు.
ప్రస్తుతం అనిల్ బెహరా మాటలకు ఊతమిచ్చేలా లేడీ అఘోరీకి సంబంధించిన పలు ఆధారాలు చక్కర్లు కొడుతున్నాయి. లేడీ అఘోరీ మెడికల్ సర్టిఫికెట్ లో శివ విష్ణు బ్రహ్మ అల్లూరి పేరిట ఉంది. ఇందులో అబ్బాయిగా పేర్కొనడం విశేషం. ఆధార్ కార్డులో అదే పేరుతో అమ్మాయిగా తెలపడం విశేషం. ఒక ధృవీకరణ పత్రంలో అబ్బాయిగా, మరో పత్రంలో అమ్మాయిగా తెలపడం విశేషం.
Also Read: Womens Railway Stations: తెలుగు రాష్ట్రాలలో మహిళలు నడుపుతున్న.. ఈ రైల్వేస్టేషన్స్ గురించి తెలుసా?
ఒకవేళ ట్రాన్స్ జెండర్ అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి కానీ ఫిమేల్ అని ఎందుకు ఉందన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఒక పేరు మార్చాలి అంటేనే వందల ప్రూఫ్స్ అడిగే అధికారులు.. అఘోరీకి ఫిమేల్ అని ఎలా ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ ఏదొక సంచలన కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారే లేడీ అఘోరీ గురించి ఈ విషయం వైరల్ అవుతుండగా, అఘోరీ స్పందించాలని నెటిజన్స్ కోరుతున్నారు. మరి ఈ ఆరోపణలకు అఘోరీ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.
మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి..
లేడీ అఘోరి ఆధార్ కార్డుపై తలెత్తుతున్న ప్రశ్నలు
ఒకవేళ ట్రాన్స్ జెండర్ అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి కానీ ఫిమేల్ అని ఎందుకు ఉంది..?
ఒక పేరు మార్చాలి అంటేనే వందల ప్రూఫ్స్ అడిగే అధికారులు.. అఘోరీకి ఫిమేల్ అని ఎలా… pic.twitter.com/o1aceozE30
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2025