Maha Kumbh Mela Free Trains: కుంభమేళా నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా నలుమూల నుంచి భక్తులు వచ్చేలా వేల సంఖ్యలో రైళ్లను నడుపుతున్నది. మొత్తం 13 వేలకు పైగా రైళ్లను షెడ్యూల్ చేసింది. వీటిలో 10 వేల రెగ్యులర్ రైళ్లు కాగా, 3 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. సౌత్ సెంట్రలర్ రైల్వే పరిధి నుంచి 180 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. IRCTC ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు నడుపుతున్నారు.
కుంభమేళాకు ఉచిత రైళ్లు
ఇక కుంభమేళాకు వెళ్లే భక్తులకు గోవా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని పనాజీ నుంచి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వరకు మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది. కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులు వీటిలో ఉచితంగా వెళ్లొచ్చని తెలిపింది. ఇక ఈ రైళ్లలో తొలి రైలు ఫిబ్రవరి 6న బయల్దేరనున్నట్లు తెలిపింది. ఉదయం 8 గంటలకు దక్షిణ గోవాలోని మార్గోవా రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. మిగిలిన రెండు రైళ్లు ఫిబ్రవరి 13, 21 తేదీలలో వెళ్లనున్నాయి. ఇవి కూడా మర్గోవా స్టేషన్ నుంచే బయలుదేరుతాయని తెలిపింది గోవా ప్రభుత్వం.
ఒక్కో రైలులో 1,000 మంది ప్రయాణం
ఇక గోవా నుంచి ప్రయాగరాజ్ మధ్య నడిచే ఈ రైళ్లలో ఒక్కో దాంట్లో 1,000 మంది భక్తులు కుంభమేళాకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కుంభమేళా ప్రత్యేక రైళ్లలో ఉచిత ప్రయాణంతో పాటు ఉచిత భోజనం కూడా అందించనున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది. గోవా రాజధాని నుంచి బయల్దేరే కుంభమేళా ఉచిత రైళ్లు 34 గంటల ప్రయాణం తర్వాత ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు చేరుకుంటాయి. ప్రయాగరాజ్ చేరుకున్న భక్తులకు వసతి, ఆహార ఏర్పాట్లు చేయనున్నట్లు గోవా ప్రభుత్వం తెలిపింది. 24 గంటల తర్వాత భక్తులు ప్రయాగరాజ్ నుంచి ఇదే రైలు తిరిగి బయల్దేరుతుందని వెల్లడించింది. భక్తులు అప్పటి లోగా రైలు ఎక్కాలని తెలిపింది.
Read Also: 57 రైళ్లకు హాల్టింగ్, తెలుగు ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఏ ఏ స్టేషన్లలో ఆగుతాయో తెలుసా?
దేవ్ దర్శన్ యోజనలో భాగంగా ఉచిత రైళ్లు
గోవా ప్రభుత్వం ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యోజనలో భాగంగా ఈ రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో 18 నుంచి 60 ఏళ్ల భక్తులు కుంభమేళాకు వెళ్లవచ్చని తెలిపింది. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు రాకూడదని తెలిపింది. ప్రయాగరాజ్ కు వెళ్లాలనుకునే గోవా వాసులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇందుకోసం ముందుకు అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలను అందజేయాలని వెల్లడించింది.
Read Also: రైలు ప్రయాణం చేసే ప్రతి ప్యాసింజర్ కు కచ్చితంగా ఈ నంబర్ తెలియాల్సిందే, ఎందుకో తెలుసా?
Read Also: అర్జెంట్ గా రైల్లో వెళ్లాలా? డోంట్ వర్రీ.. 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!