BigTV English

UPI 123 Pay : ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్.. ఎలాగంటే!

UPI 123 Pay : ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్.. ఎలాగంటే!

UPI 123 Pay : యూపీఐ.. అతి తక్కువ కాలంలోనే ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. డిజిటల్ పేమెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన యూపీఐ పేమెంట్స్.. దేశంలో మారుమూల గ్రామాలకు సైతం చేరిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ నిత్య జీవితంలో భాగమైపోయాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రోజు రోజుకి యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారి సంఖ్య పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే కొన్ని వెసులుబాట్లు సైతం అందిస్తుంది.. అవి ఏంటంటే..


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం లావాదేవీల పరిమితిని పెంచింది. ఇప్పటివరకు రూ. 5000 వరకు ఉన్న ఈ పరిమితి రూ.10వేలకు పెంచింది. అయితే ఇంకా ఈ యూపీఐ పేమెంట్స్ లో జరిగిన మార్పులు ఏంటి.. దీని ద్వారా పేమెంట్స్ చేస్తే ఏమైనా లాభాలు ఉన్నాయా.. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

యూపీఐ 123పే అనేది స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్ చేసే యూజర్స్ కోసం రూపొందించారు. ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేకుండానే దీని ద్వారా లావాదేవీలను పూర్తి చేయవచ్చు. అయితే ఇలా పేమెంట్ చేయడానికి యూపీఐ పిన్ తప్పనిసరి. యూపీఐపీ ప్రారంభంలో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు క్రియేట్ చేసే నాలుగు నుంచి ఆరు అంకెల పాస్ కోడ్. అన్ని బ్యాంక్స్ నుంచి లావాదేవీలను తేలికగా చేసేందుకు ఈ యూపీఐ పిన్ తప్పనిసరి. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించిన ఆర్బీఐ.. స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం డిజిటల్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేకుండానే ఫోన్ పే చేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. కాగా ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత నెలలోనే ధ్రువీకరించింది. ఈ యూపీఐ 123పే ఇంగ్లీష్, కన్నడ, తమిళం, బెంగాలీ, మలయాళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.


ఇందులో నాలుగు సపోర్ట్ చేసే మెథడ్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ను తేలికగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అవి

  1. వాయిస్ పేమెంట్
  2. సౌండ్ ఆధారిత పేమెంట్
  3. మిస్డ్ కాల్ పేమెంట్
  4. యాప్ ఆధారిత స్కాన్ అండ్ పే ఫీచర్ తో యూపీఐ 123పే పనిచేస్తుంది.

ఇక ఇందులో కస్టమర్స్ మల్టీ ఎకౌంట్లను లింక్ చేసే అవకాశం ఉండదు. ఒక ఎకౌంట్ ను మాత్రమే యాడ్ చేయగలుగుతారు. ఒకవేళ యూజర్స్ వేరే అకౌంట్ ను లింక్ చేయాలనుకుంటే ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ ను డీ – ఆక్టివేట్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత మాత్రమే మరో బ్యాంక్ ఎకౌంట్ను యాడ్ చేయడం అవుతుంది.

బ్యాంక్ అకౌంట్ ను ఎలా లింక్ చేయాలంటే – బ్యాంకు లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ అందించిన యూపీఐ 123 పేస్ సర్వీస్ నెంబర్కు కాల్ చేయాలి. ఇందులో అందుబాటులో ఉన్న లాంగ్వేజ్ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో లింక్ ఆప్షన్ ఉంటుంది. చివర నాలుగు నెంబర్స్ తో పాటు గడువు తేదీ ఉన్న డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాలి. లావాదేవీలకు సేఫ్ యూపీఐ పిన్ ను క్రియేట్ చేసి కన్ఫామ్ చేసిన తర్వాత యూపీఐ 123పే అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఇకపై లావాదేవీలు తేలిగ్గా జరుపుకునే అవకాశం ఉంటుంది.

 

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×