E-Paper
Advertisement

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?
Advertisement

Steam Blows Off Daryl Mitchell Bald Head: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 3rd T20I) మధ్య  వెల్లింగ్టన్ (Hnry Stadium, Wellington) వేదికగా నిన్న మూడవ టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తరఫున అద్భుతంగా ఆడిన డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) 89 పరుగులతో రెచ్చిపోయాడు. మూడవ వికెట్ కు బరిలోకి దిగిన డారిల్ మిచెల్ చివరి వరకు నిలబడి నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత డారిల్ మిచెల్ గుండు నుంచి పొగలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

ఇది చూసిన క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ గుండు గాడు ఏంటి? కట్టెల పొయ్యిపైన కూర్చున్నాడా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దాదాపు 52 బంతులు ఎదుర్కొన్న నేపథ్యంలో అతడి గుండు చాలా వేడెక్కిందని అందుకే పొగలు వచ్చాయి అంటూ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. వీడు 10 పరుగులు చేస్తేనే జెర్సీ మొత్తం చెమ‌ట‌తో తడిపేసుకుంటాడని.. అలాంటిది 89 పరుగుల వరకు నిలబడ్డాడు అంటే ఆ మాత్రం పొగలు రావాల్సిందేనని సెటైర్లు పేల్చుతున్నారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

డారిల్ మిచెల్ పోరాటం వృధా

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా (New Zealand vs India, 3rd T20I)  మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడవ టి20 సందర్భంగా డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించాడు. 52 బంతుల్లో ఏకంగా 89 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు బౌండర్లతో పాటు ఐదు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ 198 పరుగులు సాధించగలిగింది. అయితే డారిల్ మిచెల్ ఇంత కష్టపడినా… వృధా అయిపోయింది. అభిషేక్ శర్మ అలాగే వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఊచకోత కోయడంతో 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది టీం ఇండియా.

Advertisement

ఈ విజయంతో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది శ్రేయ‌స్ అయ్య‌ర్ సేన‌. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సూపర్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో అభిషేక్ శర్మ పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పదేళ్ల రికార్డును ఈ ఒక్క సెంచరీతో బ్రేక్ చేశాడు. ఒకే ఏడాదిలో 1600లకు పైగా పరుగులు చేసిన మొట్ట మొదటి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

?psln=MWd1aW91ZTBkMm9rYg==

Related News

అభిషేక్‌-వైభ‌వ్ కంటే బాబ‌ర్‌-రిజ్వానే రియ‌ల్ హీరోలు

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు

శ్రీలంక బ్యాట్లలో స్ప్రింగులు… చెక్ చేసిన బాబ‌ర్ ఆజం

టీమిండియాలో మొనగాళ్లే ఉంటే, 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేది

Big Stories

Advertisement
×