E-Paper
Advertisement

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!
Advertisement

Big TV Chairman: అమెరికాలో అదృశ్యమై 9 రోజులు గడుస్తున్నా నల్గొండ జిల్లా యువతి శ్రీజా రెడ్డి ఆచూకి ఇప్పటికీ లభ్యం కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి.. శ్రీజా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. బిడ్డ ఆచూకీ లభించక కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. బిగ్ టీవీ ఛైర్మన్ ఎన్ఆర్ఐ కావడం, శ్రీజా రెడ్డి అదృశ్యమైన బోస్టన్ సిటీలో ఆయనకు స్నేహితులు ఉండటంతో శ్రీజ వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువతి ఆచూకీ కనుగొనేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తానని భరోసా ఇచ్చారు.

మరోవైపు శ్రీజారెడ్డి ఆచూకీ కోసం రేవంత్ సర్కార్ సైతం ప్రయత్నిస్తోంది. నల్గొండ జిల్లా ప్రముఖ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీజారెడ్డి ఆచూకీకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బోస్టన్ లోని భారత్ కాన్సులేట్ అధికారులకు లేఖ రాశారు. వారికి ఈమెయిల్స్ పంపారు. అంతేకాకుండా బోస్టన్ లోని తానా ప్రతినిధి కృష్ణ ప్రసాద్ కు స్వయంగా ఫోన్ చేసి.. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని శ్రీజా ఆచూకీ వేగంగా కనుక్కునేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు గంట గంటకు మంత్రి కార్యాలయ అధికారులు.. శ్రీజ ఆచూకీపై సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కోయ శ్రీజా రెడ్డి ఈ నెల 2వ తేదీన అదృశ్యమైంది. నల్గొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ్య యాదగిరిరెడ్డి-రూప దంపతులకు ఆమె కూతురు. చదువు రిత్యా ఏడాది కిందట అమెరికా వెళ్లింది. బోస్టన్‌ యూనివర్సిటీలో చదువుతూ పార్ట్‌ టైమ్ జాబ్‌ చేస్తోంది. ఈనెల 2న సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన శ్రీజ తిరిగి రాలేదు. దీంతో ఆమె స్నేహితులు బోస్టన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె ఆచూకి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Also Read: కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

Tags

Related News

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

తెలంగాణ గల్లీ కారు.. ఢిల్లీకి చేరగానే కమలం రూపురేఖలు-సీఎం రేవంత్‌రెడ్డి

లక్డికాపూల్ వన్ వే ట్రాఫిక్ ప్లాన్! రిటైర్ బ్యాంక్ ఉద్యోగి పక్కా స్కెచ్, పరిశీలన చేస్తున్న అధికారులు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్లకు బ్రేక్! అసలేం జరిగింది?

బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!

మహిళల అండాల అక్రమ దందా కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

Big Stories

Advertisement
×