E-Paper
Advertisement

రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!

రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!
Advertisement

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: మియాపూర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిరక్షించబడిన విలువైన 550 ఎకరాల ప్రభుత్వ భూమి క్రెడిట్ పూర్తిగా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన విషయాలన్నీ పచ్చి అబద్ధాలని, సుప్రీంకోర్టు రికార్డులే ఆ వాస్తవాలను వెల్లడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మియాపూర్ భూ వివాదం 2003లోనే ఎస్ఎల్‌పీగా సుప్రీంకోర్టుకు చేరిందని, 2013 నాటికి అది సివిల్ అప్పీల్‌గా మారిందని హరీశ్ రావు గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరించారని తెలిపారు. ఇందులో భాగంగానే 2015లోనే దేశంలోని అత్యుత్తమ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన సీ.ఎస్. వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించామని, ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.

8 ఏళ్ల పోరాటం.. బీఆర్‌ఎస్ ఘనతే!

Advertisement

2015 ఏప్రిల్ 7 నుంచి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీ.ఎస్. వైద్యనాథన్ వాదిస్తూ వచ్చారని, 2015 నుంచి 2023 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం అలుపెరగని న్యాయపోరాటం చేసిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. మియాపూర్ భూమికి సంబంధించిన ప్రతి పిటిషన్, ప్రతి అఫిడవిట్, సమగ్ర ఆధారాలను కోర్టు ముందుంచింది నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.

వైద్యనాథన్‌ను నియమించింది కేసీఆరే..

Advertisement

సుప్రీంకోర్టు తన తీర్పులో ‘ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్’ కేసు (2023 జూన్ 15) తీర్పును ప్రస్తావించిందని, ఆనాడు గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసులోనూ తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించింది అదే వైద్యనాథన్ అని చెప్పారు. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పుకు బలమైన ఆధారమయ్యాయని తెలిపారు.

రేవంత్ ప్రచారం అబద్ధం!

ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉన్నప్పటికీ, తానే ఏదో సాధించినట్లు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర పోరాటం వల్లే నేడు మియాపూర్ భూములు దక్కాయన్నారు.

అమ్ముకోవడానికే కుట్రలు..

ఈ మీడియా సమావేశం వెనుక అసలు కుట్ర వేరే ఉందని హరీశ్ రావు ఆరోపించారు. మియాపూర్‌లో ఉన్న ఈ 550 ఎకరాల భూమి విలువ రూ. 60 వేల కోట్ల పైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని, ఈ విలువైన భూములను అమ్ముకోవడానికే ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విలువైన జాతి సంపదను ప్రజల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించకుండా తెగనమ్ముకునే కుట్రకు తెరలేపారని హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Also Read: కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్

Tags

Related News

ఫాక్స్ సాగర్ చెరువు గురించి మీకు తెలియని 129 ఏళ్ల నిజాలు.. త్వరలోనే మినీ ట్యాంక్‌బండ్‌గా!

కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్

చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

కేంద్రంతో సీఎం రేవంత్ కీలక భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై బిగ్ అప్‌డేట్!

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!

Big Stories

Advertisement
×