BigTV English

Vivo Y28s-Vivo Y28e Launched: వివో నుంచి రెండు ఫోన్లు.. తక్కువ ధరకే లాంచ్..!

Vivo Y28s-Vivo Y28e Launched: వివో నుంచి రెండు ఫోన్లు.. తక్కువ ధరకే లాంచ్..!

Vivo Y28s-Vivo Y28e Launched: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వివో మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫోన్లను కుప్పలు కుప్పలుగా తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే వివో భారతదేశంలో తన Y-సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. Vivo Y28s, Y28e కంపెనీ నుండి రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు. ఇవి అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చాయి. ఇందులో MediaTek Dimension 6100+ 5G ప్రాసెసర్, 5000mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు Vivo స్మార్ట్‌ఫోన్‌ల ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Vivo Y28s, Vivo Y28e Price
Vivo Y28S 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999. 6 GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 15,499. 8 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 16,999కి అందుబాటులో ఉంచారు. Vivo Y28E  4 GB RAM+ 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999. 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999.

Also Read: రూ. 14 వేల ఫోన్‌పై భారీ ఆఫర్.. 5G స్మార్ట్‌ఫోన్.. చీప్‌గా కొట్టేయండి!


ఈ రెండు ఫోన్‌ల సేల్  ఈ రోజు జూలై 8 నుండి దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమైంది. Y28S స్మార్ట్‌ఫోన్‌లు వింటేజ్ రేజ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుండగా, Y28E స్మార్ట్‌ఫోన్‌లు వింటేజ్ రెడ్,  బ్రీజ్ గ్రీన్ కలర్స్‌లో వస్తాయి.

Vivo Y28s, Vivo Y28e  Features
Vivo Y28s, Y28 రెండూ బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో విడుదలయ్యాయి. Y28s, Y28e స్మార్ట్‌ఫోన్‌లు 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇవి గరిష్టంగా 840 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hz. Y28Sకి HD+ LCD డిస్‌ప్లే ఉండగా, Y28Eకి HD డిస్‌ప్లే ఉంది. Y28Sలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఫోటోగ్రఫీ కోసం Vivo Y28S 50MP Sony IMX 852 కెమెరాను కలిగి ఉండగా, Vivo Y28e 13-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంది. Y28S 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, Y28E 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. రెండు ఫోన్లలో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఫోన్ బాక్స్‌లో 15W ఛార్జర్‌ వస్తుంది. రెండు Vivo ఫోన్‌లు IP64 రేటింగ్‌తో వస్తున్నాయి.

Also Read: కలలో కూడా అనుకోలేదు.. సామ్‌సంగ్ అల్ట్రా‌పై బిగ్ డిస్కౌంట్.. పూనకాలు లోడింగ్!

Vivo Y28s, Y28e స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్షన్ 6100 5G ప్రాసెసర్, 8 GB వరకు RAM, 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. వర్చువల్ ర్యామ్ ద్వారా ఫోన్‌లోని ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ రెండు ఫోన్‌లు Android 14 ఆధారిత FunTouch OS 14పై రన్ అవుతాయి.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×