Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ బయటకు వెళ్లబోతూ గార్డెన్‌లోకి ఏమోషనల్‌గా చూస్తుంటాడు. రాథోడ్ సార్ ఎక్కండి సార్ అని చెప్పగానే అమర్ కారెక్కి వెళ్లిపోతాడు. అమర్‌నే చూస్తున్న ఆరును చూసి చిత్రగుప్త చూచితివా బాలిక ఇందాక నీ స్నేహితురాలి చూపులో వెటకారం. నీ పతిదేవుని చూపులో మమకారం. నిన్ను చూస్తుంటే మాకు విచారం. మా మాటను విని ఈ గృహమును వీడి నువ్వు ఎచ్చటికైనా వెళ్లుము.. అని చెప్పగానే.. ఇది నా ఇల్లు గుప్త గారు. నా ఇల్లు వీడి నేను ఎక్కడికి వెళ్లను అంటుంది ఆరు. నీతో వచ్చిన చిక్కు ఇదే బాలిక మాతో యమపురికి రావు పోనీ మరొక్క చోటికి వెళ్లమనినా అచటికి వెళ్లవు.. నీ మంచి కోరే చెప్తున్నాను. వినినచో నువ్వు పదిలము.. లేనిచో ప్రమాదము అంటూ హెచ్చరిస్తాడు గుప్త. ఆరు ఆలోచనలో పడిపోతుంది.
స్కూల్ లో ఆనంద్, ఆకాష్ నోటిస్ బోర్డు దగ్గర నిలబడి చూస్తుంటారు. బంటి వస్తుంటాడు. ఆకాష్, బంటిని చూసి అరేయ్ ఆనంద్ ఆ బంటి గాడు వస్తున్నాడురా అని చెప్తాడు. బంటి దగ్గరకు రాగానే.. ఆనంద్ ఆగరా బంటి అంటాడు. ఏంటి అని బంటి అడగ్గానే.. ఎక్కడికి వెళ్లున్నావురా..? అని ఆనంద్ అడుగుతాడు. నీకెందుకు అని బంటి చెప్తాడు. మీ క్లాస్‌లో డెకరేట్ చేశావా..? అని ఆనంద్ అడగ్గానే.. నేను చేయను.. స్టూడెంట్ ప్రెసిడెంట్ నువ్వే కదా నువ్వు చేసుకో.. అంటాడు. స్టూడెంట్ ప్రెసిడెంట్ నేనే కాబట్టే నీకు పని చెప్తున్నాను అంటాడు. చేయకపోతే ఏం చేస్తావు అంటాడు బంటి. ప్రిన్సిపల్ మేడంకు చెప్తాను. క్లాస్‌రూం బయట మోకాళ్ల మీద కూర్చోబెడతారు అని బెదిరించగానే..
బంటి ఏమీ అవసరం లేదులే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు బంటి. దీంతో ఆనంద్ మీ క్లాస్ లో ఐటమ్స్ ఉన్నాయి. వెళ్లి డెకరేట్ చేయ్ అని చెప్తాడు ఆనంద్. సరే అంటూ వెళ్లిపోతాడు బంటి. ఇంతలో అక్కడకు అమ్ము వచ్చి అరేయ్ వాడి జోలికి వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాలిరా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఆకాష్ వాడికి అలాగే కావాలి అక్కా వాడు కానీ గెలిచి ఉంటే మనల్ని ఇంతకంటే ఎక్కువ టార్చర్ పెట్టేవాడు అని చెప్తాడు. అవును అక్కా నేను కాబట్టి వాడికి పని చెప్పి వదిలేశా..? అదే అంజు అయితేనా..? వాడి బెండు తీసి వదిలేసేది అని ఆనంద్ చెప్తాడు. ఆనంద్ చెప్పగానే.. అంజు వైపు చూస్తారు. అంజు డల్లుగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అమ్ము ఏమైంది అంజు.. ఏమైంది అంటే మాట్లాడవేంటి అంజు.. అని అడగ్గానే.. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు.. ఇంటికి వెల్లాలని ఉంది. ఎందుకు అంజు అంటూ ఆకాష్ అడగ్గానే..
ఎందుకో తెలియదు.. ఎందుకో భయంగా ఉంది అని చెప్తుంది. భయం ఎందుకే ఓంట్లో ఏమైనా బాగాలేదా..? అని అమ్ము అడగ్గానే.. ఏం లేదు.. నేను బాగానే ఉన్నాను.. అమ్ము నాకేం కాలేదు.. అని చెప్తుంది అంజు. మరి ఎందుకే భయం అని ఆనంద్ అడగ్గానే.. అదే తెలియడం లేదురా..? ఇంటికి వెల్లిపోవాలనిసిస్తుంది. డాడ్‌తో మాట్లాడాలి అనిపిస్తుంది అని చెప్పగానే.. అంజు ఇప్పుడే మనం స్కూల్‌కు వచ్చాం. అప్పుడే వెళ్లిపోతాం అంటే ప్రిన్సిపల్ మేడం ఏమంటుంది చెప్పు అంటుంది అమ్ము. నాకు డాడ్‌తో మాట్లాడాలి అనిపిస్తుంది అని అంజు చెప్పగానే.. సరే అంజ మిస్ వస్తున్నారు కదా నేను ఫోన్ అడిగి తీసుకుంటాను.. డాడ్‌కు కాల్ చేసి మాట్లాడు అని ఆనంద్ చెప్తాడు. టీచర్ రాగానే ఆనంద్ ఫోన్ అడుగుతాడు. టీచర్ ఫోన్ ఇవ్వగానే.. అంజు అమర్‌కు కాల్ చేస్తుంది. రాథోడ్ కాల్ లిప్ట్ చేస్తాడు. హలో రాథోడ్ నేను అని అంజు చెప్పగానే.. చెప్పమ్మా అంజు పాప అని అడుగుతాడు రాథోడ్.
డాడీ ఎక్కడున్నారు అని అంజు అడగ్గానే.. డాడీ నేను ఆఫీసుకు వెళ్తున్నాము అమ్మా అని చెప్తాడు. ఇంట్లో ఎవరున్నారు అని అంజు అడగ్గానే.. ఎవరూ లేరని రాథోడ్ చెప్తాడు. మిస్సమ్మ లేదా..? అని అడుగుతుంది. మిస్సమ్మ మీ పిన్నితో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లింది అని చెప్తాడు రాథోడ్. అయితే డాడ్‌తో మాట్లాడాలి అంటుంది అంజు. అంజు పాప మీతో మాట్లాడాలి అంటుంది సార్ అంటూ రాథోడ్ ఫోన్ అమర్‌కు ఇస్తాడు. అమర్ ఫోన్ తీసుకుని చెప్పమ్మా అంజు అనగానే.. డాడ్ నాకెందుకో భయంగా ఉంది. ఇంట్లో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. మీరు వచ్చి నన్ను ఇటికి తీసుకెళ్లండి.. అని చెప్పగానే.. ఏం భయపడకు అంజు అంతా నేను చూసుకుంటాను. నువ్వు స్కూల్ లోనే ఉండు.. అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్. రాథోడ్‌కు ఇంటికి వెళ్దాం పద అంటాడు అమర్. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం