Youtube Thumbnail Clickbait| యూట్యూబ్ ఒక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మాత్రమే కాదు. కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ కు ఆదాయ మార్గం కూడా. ఈ కంటెంట్ క్రియేటర్లు వ్యూస్ కోసం, సబ్స్‌క్రైబర్స్ కోసం కొంతమంది కంటెంట్ క్రియేటర్లు ‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్’ లాంటి షాట్ కట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే వీడియోలో లేని అంశాన్ని దాని థంబ్ నెయిల్ లో రాయడం లేదా థంబ్ నెయిల్ లో తప్పుడు ఫొటోలు పెట్టడం చేస్తున్నారు. ఈ మిస్‌లీడింగ్ క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్ పై చాలా మంది యూట్యూబ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబ్ యజమాన్యం దీన్ని ఒక సీరియస్ అంశంగా పరిగణించి.. చర్యలు చేపట్టింది.
‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్’ పెట్టే కంటెంట్ క్రియేటర్లకు వ్యతిరేకంగా చర్యలు
‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్’ ని యూట్యూబ్ నిర్ధారణకు కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేందుకు వీడియోలోని కంటెంట్ కు సంబంధం లేని సమాచారం థంబ్ నెయిల్ లో ఉండడం, సంచలనం కోసమో లేదా విషయంలో లేని తీవ్రతను థంబ్ నెయిల్ లో కనిపిస్తే వాటిని ‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్’ గా నిర్ధారిస్తుంది.
ఉదాహరణకు ఒక దేశ ప్రెసిడెంట్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా సూచిస్తూ.. “ప్రెసిడెంట్ రాజీనామా చేశారు” అని థంబ్ నెయిల్ పెట్టాక వీడియోలో అలాంటి కంటెంట్ కనిపించకపోయినా.. లేదా సంబంధిత సమాచారం లేకపోయినా అది ‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్’ కింద పరిగణిస్తుంది. ఇలాంటి థంబ్ నెయిల్ చూసి ప్రేక్షకులు వీడియోపై క్లిక్ చేశాక.. ఆ అంశం కోసమే వీడియో మొత్తం చూస్తారు. కానీ వీడియోలో అలాంటేదేమీ లేకపోవడంతో యూట్యూబ్ ప్లాట్ ఫామ్ పట్ల ప్రేక్షకుల్లో అనాసక్తి కలుగుతోందని రిపోర్ట్. దీని వల్ల యూట్యూబ్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని భావించిన యజమాన్యం చర్యలు తీసుకుంటోంది.
Also Read: విమానాల్లో హైస్పీడ్ వైఫై.. జియో, ఎయిర్‌టెల్‌కు ఎలన్ మస్క్ సవాల్
మిస్ లీడింగ్ కంటెంట్ లేదా ‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్’ కు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు యూట్యూబ్ ఇటీవల ఒక బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్, ట్రెండింగ్ అంశాలకు సంబంధించిన వీడియోలపై దృష్టి సారించింది. ఈ కేటగిరీల్లో వీడియోలు పెట్టే కంటెంట్ క్రియేటర్లు లేదా ఛానెళ్లకు యూట్యూబ్ కొత్త పాలసీ తీసుకొచ్చింది.
ముఖ్యంగా పొలిటికల్ న్యూస్ విభాగంలోని వీడియోలలో సంబంధిత కంటెంట్ లేకపోతే దాన్ని మిస్ లీడింగ్ కంటెంట్ లేదా ‘క్లిక్ బెయిట్ థంబ్ నెయిల్స్’ గా పరిగణించి ఆ వీడియోలను తొలగించేస్తుంది. దీనికోసం ప్రస్తుతమున్న నియమాలకు అదనంగా కొత్త నిబంధనలు జోడించింది.
కంటెంట్ తొలగింపు , ఫైన్
తప్పుడు సమాచారం ఇచ్చే ఛానెళ్ల కు మొదటి హెచ్చరికగా వీడియోలు మాత్రమే తొలగిస్తారు. ఛానెల్ పై నిషేధం విధించరు. ఒకవేళ ఇదే మళ్లీ మళ్లీ రిపీట్ అయితే ఛానెల్ పై ఫైన్ విధిస్తామని తెలిపింది. కానీ ఆ ఫైన్ ఎంత మొత్తం అనేది వివరాలు వెల్లడించలేదు. యూట్యూబ్ ప్రేక్షకులకు వారికి కావాల్సిన ఒరిజినల్ కంటెంట్ మాత్రమే అందించే ప్రయత్నంలో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చామని యూట్యూబ్ తెలిపింది.