Vivo Y39 5G Launch: మీరు అదిరిపోయే కెమెరా సహా మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, Vivo Y39 5G మీకు మంచి ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే ఈ సంస్థ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ధరల్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Y సిరీస్‌లో Vivo Y39, అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ Qualcomm 4nm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తూ 256GB స్టోరేజ్ వరకు అందిస్తుంది. 50 మెగాపిక్సెల్ Sony HD కెమెరాతో పాటు, AI నైట్ మోడ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
Vivo Y39 5G స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.68-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని రిజల్యూషన్ 720 x 1608 పిక్సెల్స్ కాగా, 120Hz రిఫ్రెష్ రేట్, 264 ppi పిక్సెల్ డెన్సిటీ అందిస్తుంది. ఈ ఫోన్ Android 15 ఆధారంగా నడిచే Funtouch OS 15తో వస్తుంది. కంపెనీ ప్రకారం, రెండు సంవత్సరాల పాటు Android అప్‌డేట్స్, మూడేళ్ల భద్రతా అప్‌డేట్స్ అందిస్తారు.
ఫోటోగ్రఫీ, కెమెరా ఫీచర్లు
Vivo Y39 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony HD ప్రైమరీ కెమెరా, 2MP బొకే కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. కెమెరా ఫీచర్లలో AI నైట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఉన్నాయి.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్.. .
ప్రాసెసింగ్ పనితీరు
ప్రాసెసింగ్ పనితీరుకు Snapdragon 4 Gen 2 SoC ప్రాసెసర్ అందించబడింది. ఇది 8GB LPDDR4X RAMతో పాటు 256GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంటుంది. అయితే, మెమొరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించలేము. దీనికి అదనంగా 8GB వర్చువల్ RAM కూడా అందుబాటులో ఉంది.
AI ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు
ఈ ఫోన్‌లో అనేక AI-ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఫోటోలను మెరుగుపరిచే AI Photo Enhance, అవాంఛిత వస్తువులను తొలగించే AI Erase, కాల్ క్వాలిటీని మెరుగుపరిచే AI Audio Algorithm వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఉత్పాదకతను పెంచేందుకు AI SuperLink, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Google Circle to Search, Gemini వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా Vivo ఇందులో ఇచ్చింది.
కనెక్టివిటీ, బ్యాటరీ
Vivo Y39 5G డ్యూయల్ సిమ్, 5G, Bluetooth 5.0, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఈ ఫోన్ 6,500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఇది వేగంగా చార్జ్ అవుతుంది, రోజంతా బ్యాకప్ అందించగలదు.
Vivo Y39 5G ధర, ఆఫర్లు
Vivo Y39 5G రూ.16,999 నుంచి ప్రారంభమవుతోంది (8GB + 128GB వేరియంట్ కోసం). 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఈ ఫోన్ Lotus Purple, Ocean Blue రంగుల్లో అందుబాటులో ఉంది. Amazon, Flipkart, Vivo India e-Store, ఇతర రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 6 వరకు కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.1,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు.