BigTV English

Hyderabad to Manali: హైదరాబాద్ నుంచి మనాలి టూర్ ప్లాన్ చేస్తున్నారా? జస్ట్ రూ. 12 వేలలో వెళ్లి రావచ్చు తెలుసా?

Hyderabad to Manali: హైదరాబాద్ నుంచి మనాలి టూర్ ప్లాన్ చేస్తున్నారా? జస్ట్ రూ. 12 వేలలో వెళ్లి రావచ్చు తెలుసా?

సమ్మర్ హాలీడేస్ లో చాలా మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారు. ఎలాగూ పిల్లలకు వేసవి సెలవు కూడా ఉండటంతో చల్లా ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటారు. అలాంటి వారికి బెస్ట్ హాలీడే స్పాట్ మనాలి. హైదరాబాద్ నుంచి తక్కువ ఖర్చులో వెళ్లి రావచ్చు. ఇంతకీ హైదరాబాద్ నుంచి అక్కడికి ఎలా వెళ్లాలి? ఎన్ని రోజులు టూర్ ఉంటుంది? ఎక్కడ స్టే చేయాలి? ఖర్చు ఎంత అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


జస్ట్ రూ. 12 వేలతో ట్రిప్ కంప్లీట్..

ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి మనాలికి కేవలం రూ. 12,000లతో  వెళ్లి రావచ్చు. రైలు ప్రయాణం ద్వారా వెళ్లే వారికి మాత్రమే ఈ ఖర్చు అవుతుంది. మొత్తం ఈ టూర్ 7 పగళ్లు, 6 రాత్రుల పాటు కొనసాగుతుంది.


డే 1: ప్రతి రోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఉంటుంది. 3ఏసీ క్లాస్ టికెట్ ధర రూ.1,840 ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకుని ఢిల్లీకి ప్రయాణం మొదలుపెట్టాలి.

డే 2: 26 గంటల ప్రయాణం తర్వాత రైలు ఢిల్లీకి చేరుకుంటుంది. అక్కడి నుంచి మనాలికి ఓవర్ నైట్ ఓల్వో బస్ బుక్ చేసుకోవాలి. బస్సు ఛార్జ్ రూ. 1059 ఉంటుంది. ఢిల్లీ నుంచి 10 నుంచి 12 గంటల తర్వాత మనాలికి రీచ్ అవుతారు.

డే 3: మనాలికి చేరుకున్న తర్వాత హాస్టల్ తీసుకోవాలి. లేదంటే మన తెలుగు వాళ్ల స్టేలు కూడా ఉంటాయి. వాటిని బుక్ చేసుకోవాలి. తర్వాత రెండు రోజులు అక్కటే స్టే చేయాలి. ఒక్క రోజు ఉండేందుకు ఖర్చు రూ. 700 నుంచి ప్రారంభం అవుతుంది. చెకిన్ తర్వాత ఫ్రెష్ అయి, లంచ్ చేసిన తర్వాత కుదిరితే, బైక్ లేదంటే స్కూటీని రెంట్ కు తీసుకోండి. లేదంటే మనాలి బస్టాండ్ కు వెళ్లి సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్  బస్ టైమింగ్స్ తెలుసుకోవాలి. అక్కడి నుంచి మాల్ రోడ్ కు వెళ్లి ఎక్స్ ప్లోర్ చేసి మూడో రోజును ముగించండి.

డే 4: ఎర్లీగా స్టార్ట్ అయి సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్, వశిష్ట ఆలయం, జోగిని ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి.

Read Also: వామ్మో! రోజూ అన్ని లక్షల మందికి ఫుడ్ అందిస్తారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!

డే5: ఐదవ రోజు హడింబ టెంపుల్, ఓల్డ్ మనాలీ అందాలను వీక్షించండి. అక్కడి నుంచి కసోల్ కు స్టార్ట్ కావాలి. మణికరన్ హాట్ స్ట్రింగ్స్, గురుద్వారాను విజిట్ చేయండి. ఆ తర్వాత ఓవర్ నైట్ బస్ బుక్ చేసుకుని ఢిల్లీకి చేరండి.

డే6: ప్రతి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఉంటుంది. దాన్ని బుక్ చేసుకుని హైదరాబాద్ కు తిరిగి రావాలి. తక్కువ ధరలో మనాలి టూర్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమ్మర్ లో మనాలికి ట్రిప్ ప్లాన్ చేసేయండి!

Read Also: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయకూడదు!

Tags

Related News

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Big Stories

×