BigTV English

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? మోదీ చెప్పింది చేస్తే మీరు సేఫ్..

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? మోదీ చెప్పింది చేస్తే మీరు సేఫ్..

Digital Arrest : డిజిటల్ అరెస్ట్… ప్రస్తుతం మీ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అనే ప్రస్తావనే లేదని… ఇదంతా మోసగాళ్ల పనేనని తెలిపారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగటం భారతీయ చట్టాల్లోనే లేదని స్పష్టం చేశారు. ఇక ఈ డిజిటల్ అరెస్ట్ విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అయితే అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి… దీని ద్వారా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం.


డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి –

అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే… మోసగాళ్లు పోలీస్, ఇన్కమ్ టాక్స్, సిబిఐ అధికారులమంటూ కాల్ చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. వీడియో కాల్స్ సైతం చేసి మీపై కేసులు నమోదు చేశామంటూ బెదిరించి లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు.  మీపై కేసు బుక్ చేసాం.. ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి.. ఎటూ కదలొద్దు.. ఎవరికీ కాల్ చేయొద్దు అంటూ ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటివి బ్యాగ్రౌండ్ లో సెటప్ చేసుకొని… అవి వీడియో కాల్ లో కనిపించేలా మాట్లాడుతూ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అచ్చం నిజమైన యూనిఫామ్స్ ధరించి నకిలీ ఐడి కార్డులు సైతం చూపిస్తున్నారు.


మీరు పంపిన పార్సిల్స్ లో డ్రగ్స్ ఉన్నాయని కొందరు… ఫోన్ ద్వారా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని మరికొందరు బాధితుల్ని బెదిరిస్తున్నారు. ఇక కొన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ అరెస్టు వారెంట్లను సైతం తయారు చేసి బెంబేలెత్తిస్తున్నారు.

ఈ తరహా కేసుల్లో ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోయారు. తాజాగా ఓ వ్యక్తి రూ. 20 లక్షలు నష్టపోయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు సైతం చేశాడు. పోలీసులు డ్రగ్స్ సీజ్ చేసినట్టు మోసగాళ్లు నమ్మించి, సెటిల్ చేసుకోకపోతే కఠిన చర్యలు తప్పమంటూ బెదిరించడంతో బాధితులు చేసేదేం లేక వారు అడిగిన మొత్తం రూ. 20 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది.

ALSO READ : కింగ్ లాంటి ఆఫర్.. కంప్యూటర్ గ్యాడ్జెట్స్​పై 70శాతం డిస్కౌంట్.. టైం లేదు బ్రో!

రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ డిజిటెల్ అరెస్ట్ పై స్పందించిన ప్రధాని మోదీ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ మోసాల బారిన పడొద్దని తెలిపారు. ఇలాంటి సంఘటన ఎదురైతే వెంటనే కొన్ని స్టెప్స్ ఆచరించాలన్నారు. అవి ఏంటంటే…

1.ముందుగా భయపడుతున్నట్లు కనపడకుండా ప్రశాంతంగా ఉండాలి.

2.వీలైతే కాల్ ను స్క్రీన్ రికార్డ్ చేయాలి

3.భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని గుర్తించాలి

4.ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్‌లైన్ ద్వారా కాంటాక్ట్ అవ్వదనే విషయాన్ని గుర్తించాలి

5.నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు 1930కు కాల్ చేయాలి.

6.పోలీసులకు ఫిర్యాదు చేయాలి

ఈ స్టెప్స్ ఫాలో అవుతూ నేరస్తులను పట్టించే ప్రయత్నం చేయాలని.. భయపడుతూ నేరస్థులకు లొంగే ప్రయత్నం మాత్రం చేయకూడదని తెలిపారు. నిర్భయంగా ఉంటూ ఇలాంటి సైబర్ నేరాలను ప్రతీ ఒక్కరూ ఎదురుకోవాలన్నారు మోదీ.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×