80s Bajaj Chetak: 1980 కాలంలో సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు అబ్బాయి తరఫు వాళ్ల ఫస్ట్ కండిషన్.. ‘మావాడికి ఒక బజాజ్ చేతక్ కొనిస్తే చాలు!’ అని. పెళ్లి ఖాయమయ్యాక స్కూటర్ ఇంటి ముందుకు దిగగానే, వీధిలో ఉన్నవాళ్లంతా అదో పెద్ద పండుగలా చుట్టూ ముసిరి మురిసిపోయేవారు. వింటేజ్ మెటాలిక్ షైన్, పెట్రోల్‌లో ఆయిల్ కలిపి పోసే ఆనాటి పద్ధతి.. రోడ్డు మీద వెళ్తుంటే కుర్రాళ్లకు తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టేది.
అప్పట్లో స్కూటర్ బుకింగ్ లెటర్ వచ్చిందంటే.. లాటరీ తగిలినంత సంబరపడిపోయేవారు. అది డెలివరీ కావడానికి కళ్లు కాయలు కాచేలా ఐదారేళ్లు కాపలా కాయాల్సిందే. ఇక సండే వచ్చిందంటే చాలు.. బండి ముందు పిల్లాడిని నిలబెట్టి, వెనుక భార్యను కూర్చోబెట్టుకుని, మిర్రర్‌కి కిరాణా సంచి తగిలించి షికారుకి వెళ్తుంటే.. ఆ ఒక్క టూ-వీలర్‌పైనే ఐదుగురి ప్రయాణం ఒక క్యూట్ ఫ్యామిలీ మెమరీ.
మరోవైపు ఇంజిన్ స్టార్ట్ కావడానికి సైడ్ కి కాస్త వంచి, గట్టిగా కిక్ కొట్టే 80స్ టెక్నిక్ ప్రతీ రౌడీ రైడర్‌కి తెలిసిందే. ఉదయాన్నే స్పార్క్ ప్లగ్ ఊడదీసి క్లీన్ చేయడం, గుడ్డతో బండిని అద్దంలా మెరిపించడం ప్రతీ ఇంట్లో ఒక డైలీ రొటీన్. ఆ ప్రాసెస్ అంతటిలో మెకానిజం కంటే స్కూటర్‌తో ఓ స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ క్లియర్ గా కనిపించేది.
Also Read: చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!
కట్ చేస్తే ఇవాళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాళాల సంగతి దేవుడెరుగు నేరుగా స్మార్ట్ ఫోన్ ద్వారానే స్టార్ట్ చేయగల ఓలా, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇన్‌స్టంట్‌గా ఇంటికి వచ్చేస్తున్నాయి. బటన్ స్టార్ట్‌లు, డిజిటల్ స్క్రీన్‌లు, రీఛార్జ్ వైబ్స్‌తో రైడింగ్ అంతా సైలెంట్‌గా మారిపోయింది. అయితే లైఫ్ ఎంత కంఫర్ట్ అయిపోయినా.. అప్పటి చేతక్ మీద ముచ్చట్లతో సాగిన ప్రయాణాల్లో ఉన్న ఎమోషన్.. ఈరోజు సైలెంట్‌గా వచ్చే ఈవి స్కూటర్లలో దొరకదనేది నిజమే కదా?
Also Read: ఇప్పటి ఆర్భాటాలు లేవు కానీ.. 80ల్లో వినాయకచవితి మజానే వేరు.. ఆ రోజులు మళ్లీ రావు!