Formula E Race Case: ఫార్ములా ఈ రేసు కేసు విచారణ నుంచి తప్పించుకు నేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్. ఆయనకు గ్రహాలు అనుకూలించలేనట్టు కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. అక్కడా నిరాశే ఎదురైనట్టు కనిపిస్తోంది. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా, ఇప్పటివరకు రిజిస్టర్ కాలేదు. ఇప్పట్లో రిజిస్టర్ అయ్యే అవకాశం లేవని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతోంది కేటీఆర్ లీగల్ టీమ్. వీలు కుదరని పక్షంలో సంక్రాంతి తర్వాత కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముందని చెబుతోంది. నార్మల్‌గా శని, ఆదివారం సెలవు వుంటాయి. సోమ, మంగళవారం సంక్రాంతి నేపథ్యంలో బుధవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముందని అంటున్నారు.
ఈ రెండు రోజుల్లో రిజిస్టర్ చేస్తేనే. లేకుంటే వచ్చే వారం కూడా కష్టమేనన్నది లాయర్ల వాదన. మరోవైపు ఫార్ములా ఈ -రేసు కేసులో గురువారం ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. సరైన సమాధానాలు రాని పక్షంలో విచారణ తర్వాత వీలైతే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇదిలావుండగా ఏసీబీ విచారణకు హాజరైనా, ఈడీ విచారణకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నాడట కేటీఆర్. జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు రాలేనని చెబుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి ఈడీ అరెస్ట్ చేస్తే ఐదారు నెలల వరకు బెయిల్ రాదని అంటున్నారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ALSO READ: గాంధీభవన్‌లో పీఏసీ మీటింగ్.. వాటిపై చర్చ