E-Paper
Advertisement

WhatsApp New Update: కొత్త అప్‌డేట్ వచ్చింది.. ఇప్పుడు ఏ లాంగ్వేజీ మెసేజైనా ఈజీగా చదవచ్చు!

WhatsApp New Update: కొత్త అప్‌డేట్ వచ్చింది.. ఇప్పుడు ఏ లాంగ్వేజీ మెసేజైనా ఈజీగా చదవచ్చు!
Advertisement

WhatsApp New Update: దేశంలో ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో వాట్సాప్ ఒకటి. ఈజుల్లో వాట్సాప్ లేని ఫోన్ ఉండదు. ప్రతి ఒక్కరు వాట్సాప్‌తోనే కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ మేసేజింగ్ యాప్ యూజర్లకు మరింత చేరువయేందుకు నిరంతర సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. తాజాగా మరొకొత్త ఫీయర్‌ను పరిచయం చేయనుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఇంటర్‌ఫేస్‌ తీసుకురానుంది. అంతేకాదు మెసేజ్ సులువుగా అర్థం చేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన ఫీచర్ డెవలప్ చేస్తోంది. ఈ రెండు అప్‌డేట్‌లు ముందుగా ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త అప్‌డేట్‌తో స్టేటస్‌లో క్లీనర్, మెరుగైన ఇంటర్‌ఫేస్ అందించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

WA బీటా ఇన్ఫో నివేదించినట్లుగా తాజా బీటా వెర్షన్, ఆండ్రాయిడ్ 2.24.15.11 కోసం WhatsApp బీటా, స్టేటస్ అప్‌డేట్‌లతో వినియోగదారులు మధ్య జరిగే సంబాషణలో కొన్ని మార్పులు చేయనుంది. స్టేటస్ అప్‌డేట్ స్క్రీన్‌లోని టాప్ సెక్షన్ రీడిజైన్‌లో వస్తుంది. కంపెనీ ఇప్పటికే iOSలో అటువంటి ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది. ఈ మార్పుతో నావిగేషన్ మెరుగుపడిందని కంపెనీ చెబుతోంది. గతంలో స్టేటస్ అప్‌డేట్ స్క్రీన్ పైనున్న ఓవర్‌ఫ్లో మెను అనేక ఆప్షన్స్ కలిగి ఉంది. ఇది ఇప్పుడు కొత్త అప్‌డేట్‌లోకి మార్చనున్నారు.

Advertisement

Advertisement

 

ఇది మాత్రమే కాదు కంపెనీ త్వరలో వాట్సాప్‌లో చాటింగ్‌లను సులభంగా అర్థం చేసుకోవడానికి కొత్త సిస్టమ్ రూపొందిస్తుంది. ట్రాన్స్‌లేట్ ఫీచర్ త్వరలో యాప్‌కి రాబోతోంది. దీని సహాయంతో మీరు ఏదైనా చాటింగ్ అర్థం చేసుకోవడానికి మరే ఇతర యాప్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాట్‌లో ఒక చిన్న స్టెప్ ఫాలో అవడం ద్వారా మీరు మెసేజ్‌ని హిందీ లేదా ఆంగ్లంలో చదవగలరు. ఈ ఫీచర్‌లో హిందీ లాంగ్వేజీ సపోర్ట్ చాలా ముఖ్యంగా ఉంటుంది.

Also Read: CMF Phone 1 Sales Record: CMF రికార్డ్ సేల్స్.. క్షణాల్లో అవుట్ ఆఫ్ ది స్టాక్.. మళ్లీ సేల్ ఎప్పుడంటే?

తర్వాత అప్‌డేట్‌లో కంపెనీ ఐఫోన్ వినియోగదారుల కోసం తన యాప్‌లోని కాలింగ్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేస్తుంది. ఈ కొత్త కాలింగ్ అప్‌డేట్ చాలా అట్రాక్ట్‌గా ఉంటుంది. అయితే మీరు కొత్త ఇంటర్‌ఫేస్‌ని పొందకుంటే వెంటనే మీ WhatsApp యాప్‌ను అప్‌డేట్ చేయండి. దీని తర్వాత కూడా మీరు కొత్త కాలింగ్ ఇంటర్‌ఫేస్‌ను పొందకపోతే కంపెనీ మరికొన్ని రోజుల్లో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తుంది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×