BigTV English

India’s Team For Sri Lanka Tour: కొత్త, పాతల కలయికతో టీమ్ ఇండియా

India’s Team For Sri Lanka Tour: కొత్త, పాతల కలయికతో టీమ్ ఇండియా
India’s Team For Sri Lanka Tour: కొత్త కోచ్ గౌతంగంభీర్ జట్టు కూర్పులో తన మార్కు చూపించాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర కసరత్తు చేసి జట్టుని ప్రకటించారు. దీంతో పాత, కొత్త కలయికతో జట్టుని రెడీ చేశారు. టీ 20 కెప్టెన్ గా సూర్యకుమార్ ని ప్రకటించారు. ఇక వన్డే వరకు రోహిత్ శర్మ ఉంటాడు. వీరికి స్టాండ్ బైగా శుభ్ మన్ గిల్ ని రెండు ఫార్మాట్లలో నిలబెట్టారు. దీంతో ఇక హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయనే అంటున్నారు.

ఒకవేళ వన్డేల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఉంటాడు కాబట్టి, తనే ముందుండి నడిపించాల్సి ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ను ద్రష్టిలో పెట్టుకుని శుభ్ మన్ గిల్ కి అవకాశాలు ఇస్తున్నట్టు చెబుతున్నారు. 2026 టీ 20 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ కెప్టెన్ గా ఉంటాడు. ఇక్కడికి లెక్క సరిపోయింది.


ఇక జట్టుపరంగా చూస్తే సెలవులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ కూడా శ్రీలంక పర్యటనలో పాల్గొననున్నారు. రవీంద్రజడేజా, బుమ్రా ఇద్దరికి విశ్రాంతి కల్పించారు. జడేజాకి కూడా ఇటీవల మోకాలి శస్త్రచికిత్స జరిగింది. ఆ కారణంతో తనకి సెలవు ఇచ్చారు. బుమ్రాకి వర్క్ లోడ్ నేపథ్యంలో అనుమతి మంజూరు చేసినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు మాత్రం వన్డే పర్యటన వరకు సెలవు మంజూరు చేశారు. రోహిత్, కొహ్లీ ఇద్దరికి   మాత్రం ‘సెలవు దొరకలేదు.

Also Read: మెగాస్టార్ మామూలోడు కాదురోయ్.. చిరంజీవి డ్యాన్స్ అంటే విరాట్ కోహ్లికి పిచ్చంటా!


ఇకపోతే జింబాబ్వే పర్యటనలో అద్భుత సెంచరీ చేసి, ఐపీఎల్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మకు అవకాశం దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్ లకు అవకాశాలిచ్చారు. వీరితో పాటు సస్పెన్షన్ కు గురైన శ్రేయాస్ అయ్యర్ ను వన్డేలకు తీసుకొచ్చారు. ఇక కేఎల్ రాహుల్ కు అవకాశమిచ్చారు.

కులదీప్ యాదవ్ ని వన్డేలకే పరిమితం చేశారు. టీ 20 ప్రపంచకప్ లో అద్భుతంగా బౌలింగు చేసి కొన్ని మ్యాచ్ ల్లో గెలిపించిన తీరు అద్భుతమని చెప్పాలి. అయితే సెమీఫైనల్, ఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్ ల్లో తేలిపోయాడు. అందుకే టీ 20లకి పక్కనపెట్టారని అనుకుంటున్నారు. అతని స్థానంలో రవి బిష్ణోయ్ కి అవకాశమిచ్చారు. మొత్తానికి ఇలా పాత కొత్త కలయికలతో గౌతంగంభీర్ టీమ్ రెడీ అయ్యింది. అయితే అంత గొప్పగానూ లేదు, అంత చెత్తగానూ లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.పాత్రలని మార్చాడంతే. మరి వంట ఎలా ఉంటుందో చూడాలని సరదాగా అంటున్నారు.

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×