E-Paper
Advertisement

 KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?

 KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?
Advertisement

KBR Park Traffic Plan: కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డుకెక్కాలంటే ఒకప్పుడు వాహనదారులకు చుక్కలు కనిపించేవి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయేది. ఈ నగర రద్దీకి చెక్ పెట్టేందుకు గతంలో రూ.1,090 కోట్ల అంచనాతో ఏడు మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

క్లాక్‌వైజ్ సర్క్యులేషన్ గ్రాండ్ సక్సెస్

Advertisement

ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ‘సిగ్నల్ రహిత నాన్-స్టాప్ వన్-వే క్లాక్‌వైజ్ సర్క్యులేషన్’ విధానాన్ని తెచ్చారు. ‘కుడి నుంచి ఎంట్రీ.. ఎడమకు ఎగ్జిట్’ ఫార్ములా ఊహించని విజయాన్ని అందించింది. ప్రయాణ సమయం ఏకంగా 50 శాతానికి పైగా తగ్గిపోవడంతో.. కేవలం సైన్ బోర్డులు, ప్రాపర్ యూ-టర్న్ మేనేజ్‌మెంట్‌తోనే ఏళ్లనాటి ట్రాఫిక్ సమస్య మాయమైంది.

పాత ప్రాజెక్ట్ రద్దు.. గుంతల పూడ్చివేత

Advertisement

ఈ వన్-వే విధానం అద్భుత ఫలితాలివ్వడంతో పాత భారీ కాంక్రీట్ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనబెట్టింది. గతంలో అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, ఇతర ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల కోసం తవ్విన భారీ గుంతలను ప్రస్తుతం ట్రక్కులు, ట్రాక్టర్లతో మట్టిని తెచ్చి వేగంగా పూడ్చేస్తున్నారు. ఆ స్థలాలను రోడ్డుకు సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో పిల్లర్ల కోసం వేసిన నిర్మాణాలను కూడా ఆపేశారు.

రూ.751 కోట్లతో కొత్త ఎలివేటెడ్ కారిడార్

రూ.1,000 కోట్లకు పైగా వ్యయం, భారీగా భూసేకరణ అవసరమయ్యే పాత ప్లాన్ స్థానంలో ఒక ఎఫెక్టివ్ ప్లాన్‌‌ను తెరపైకి తెచ్చారు. ముఫఖం జా కాలేజ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల బై-డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. దీనికి దాదాపు రూ.751 కోట్లు ఖర్చవుతుందని, భూసేకరణ వ్యయం కూడా రూ.300 కోట్లలోపే ఉంటుందని అంచనా. పైగా ఇప్పటికే పార్క్ హయత్, కేబీఆర్ గేట్ వద్ద వేసిన పిల్లర్లను కొత్త ప్రాజెక్టులో వాడుకోనున్నారు.

పర్యావరణ పరిరక్షణ – ప్రజాధనం ఆదా

హడావుడి నిర్ణయాల కంటే సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తోనే సమస్యలు తీరతాయని ఈ మార్పు నిరూపించింది. భారీ కాంక్రీట్ నిర్మాణాలను రద్దు చేయడం వల్ల వందల కోట్ల ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పచ్చదనం చెక్కుచెదరకుండా సురక్షితంగా మిగిలింది.

Also Read: రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

Tags

Related News

రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

Big Stories

Advertisement
×