WhatsApp Account Shutdown: ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మెసేజింగ్ యాప్. అయితే కొద్ది రోజులుగా చాలా మంది యూజర్లకు తమ వాట్సాప్ లాగిన్ స్క్రీన్‌పై ఊహించని వార్నింగ్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. చాలా రోజుల నుంచి సడన్‌గా అకౌంట్ షట్ డౌన్ కావడం లేదా రివ్యూలో పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు ఈ వార్నింగ్ ఎందుకు వస్తుంది? దీని వెనక ఉన్న కారణాలు ఏంటి ? ఇలా వచ్చినప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ కాకుండా ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్ లేదా ఇతర మోడి ఫైడ్ యాప్‌లను డౌన్ లోడ్ చేసి వాడుతుంటారు. సాధారణ వాట్సాప్‌లో లేని ఫీచర్లు వస్తాయనే.. ఆశతో వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. మీ అకౌంట్ హ్యాక్ కావడం ఖాయం. వాట్సాప్ సెక్యూరిటీ సిస్టమ్.. ఇలాంటి అనధికారిక యాప్‌లను గుర్తించిన వెంటనే.. లాగిన్ స్క్రీన్‌పై వార్నింగ్ జారీ చేసి అకౌంట్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది.
ఒకే సారి గ్రూపుల్లో పరిమితికి మించి మెసేజ్‌లు పంపడం, మీ దగ్గర నంబర్ లేని తెలియని వ్యక్తులకు భారీగా మార్కెటింగ్ మెసేజ్‌లు లేదా స్పామ్ లింక్స్ ఫార్వర్డ్ చేయడం వంటివి చేస్తే.. వాట్సాప్ ఆటో మేటిక్ బాట్స్ వీటిని గుర్తిస్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి అకౌంట్ కంపెనీ సమీక్షలోకి తీసుకుంటుంది. అప్పుడు లాగిన్ స్క్రీన్‌పై “అకౌంట్ అండర్ రివ్యూ” లేదా షట్‌డౌన్ వార్నింగ్ కనిపిస్తుంది.
మీరు పంపే మెసేజ్‌లతో ఇబ్బంది పడి ఎక్కువ మంది యూజర్లు మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్ చేసినా లేదా స్పామ్‌గా రిపోర్ట్ చేసినా మీ అకౌంట్ ప్రమాదంలో పడుతుంది. వాట్సాప్ తన యూజర్ల అకౌంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి.. ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను అస్సలు సహించదు.
Also Read: మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!
1.ఎప్పుడూ అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే వాట్సాప్ అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
2. జీబీ వాట్సాప్ లేదా ఇతర మోడిఫైడ్ యాప్‌లను వెంటనే డిలీట్ చేసి, అఫీషియల్ యాప్‌కు మారిపోండి.
3. తెలియని వ్యక్తులకు ఎక్కువగా మెసేజ్‌లు పంపడం, అనధికారిక బల్క్ మెసేజింగ్ సాఫ్ట్ వేర్‌లను వాడటం పూర్తిగా ఆపేయండి.
మీ వాట్సాప్ లాగిన్ స్క్రీన్‌పై ఇలాంటి హెచ్చరికలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయెద్దు. వెంటనే తప్పులను సరిdrద్దుకొని అధికారిక యాప్‌ను మాత్రమే ఉపయోగించడం ద్వారా మీ విలువైన చాట్స్ ,అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు.