E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్టులు పాస్ అవ్వాల్సిందేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్టులు పాస్ అవ్వాల్సిందేనా?
Advertisement

Bigg Boss Divi: బిగ్ బాస్.. రియాలిటీ షో గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. పలు భాషలలో వివిధ సీజన్లతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది ఈ షో. ఇకపోతే అలాంటి ఈ షో కి వెళ్ళాలి అంటే సామాన్యులకైతే అగ్నిపరీక్ష అనే ఒక వేదిక ఉంది.మరి సెలబ్రిటీలకు ఎలాంటి టెస్టులు లేకుండానే హౌస్ లోకి పంపిస్తారని అందరూ అనుకుంటారు. అయితే అలాంటిదేమీ లేదని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలంటే సెలబ్రిటీలకు కూడా కొన్ని టెస్టులు ఉంటాయని, ఆ టెస్టు పాస్ అయితేనే వారిని హౌస్ లోకి పంపిస్తారు అంటూ బిగ్ బాస్ వెనుక నిజాలను బయటపెట్టింది ప్రముఖ నటి దివి.

బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే ఇన్ని టెస్ట్ లా?

ప్రముఖ సెలబ్రిటీ మేనేజర్, సినీ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో లేటెస్ట్ ఎపిసోడ్ లో భాగంగా గెస్ట్ గా పాల్గొన్న దివి ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఏం అడిగారు? ఏ ఏ టెస్టులు ఉంటాయి ? అనే విషయాలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. రాజా రవీంద్ర మాట్లాడుతూ..” బిగ్ బాస్ హౌస్ లో మీరు అడుగు పెట్టారు కదా.. అలా అడుగు పెట్టడానికి ముందు మీ హైట్ , మీ గ్లామర్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారా? అని ప్రశ్నించారు.

అవన్నీ పాస్ అయితేనే ఎంట్రీ దొరుకుతుంది – దివి

Advertisement

దివి మాట్లాడుతూ..” మొదట కొన్ని ఫోటోలు చూశారు. ఆ తర్వాత ఒక మూడు, నాలుగు ఇంటర్వ్యూలు అయ్యాయి. ముఖ్యంగా వీడియో కాల్ లో ముగ్గురు, నలుగురు ఒకేసారి మాట్లాడుతారు. అది కాకుండా మళ్లీ ఒక డాక్టర్ మాట్లాడతారు. మన మెంటల్ కండిషన్ ఎలా ఉంది ? అనే విషయం చూస్తారు. ఆ తర్వాత ఫిజికల్ గా బాడీ టెస్టులు కూడా జరుగుతాయి. మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అనే విషయాన్ని కూడా చూస్తారు . ఆ తర్వాతే హౌస్ లోకి ఎంట్రీ దొరుకుతుంది అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందు జరిగే టెస్టుల గురించి దివి ఓపెన్ గా చెప్పేసింది. మొత్తానికి అయితే దివి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వరంగల్ గా మారడంతో హౌస్ లోకి వెళ్లాలంటే ఇన్ని టెస్టులు పాస్ అవ్వాలా అంటూ నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

బీపీ, షుగర్, మెంటల్ టెస్ట్:

ముఖ్యంగా బీపీ, షుగర్ తో పాటు మెంటల్ టెస్ట్ కూడా చేస్తారు. ముఖ్యంగా మీరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా గొడవ పెట్టుకుంటారా? లేక స్టేబుల్ గా ఉంటారా? లేదా మరేదైనా అనారోగ్య సమస్య వస్తుందా ? అనే విషయాలన్నింటినీ ముందుగా చెక్ చేస్తారు. అంటూ ఎన్నో విషయాలను బయట పెట్టింది దివి.

Advertisement

ALSO READ: అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది..

ఇదే ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర తో మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తోంది..ఇప్పటికి కూడా భయం కలుగుతోంది. కళ్ళల్లో ఆ పవర్ ఫుల్ లుక్ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ముఖ్యంగా మనం కలిసి పని చేసిన రోజులు, ఇప్పుడు కూడా ఆ కళ్ళల్లో ఆ ఆరా కనిపిస్తోంది అంటూ తెలిపింది..

Related News

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

Gundeninda GudiGantalu Today episode: తాయత్తు ఎంతపని చేసింది..? ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : మహా, విక్కీ లవ్ ట్రాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పై సెటైర్లు.. ఇదే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..? ఇంట్లోంచి వల్లి వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన పల్లవి.. దిమ్మతిరిగే షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Nindu Noorella Saavasam Serial Today Episode October 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు స్పాట్‌కు తీసుకెళ్లిన మనోహరి

Karthika Deepam 2 Serial Today Episode October 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం తెలుస్తుందా..? సూరజ్ అడ్డుపడతాడా..?            

Big Stories

Advertisement
×