E-Paper
Advertisement

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!
Advertisement

WhatsApp Web Features: ఇప్పటివరకు సిస్టం లేదా ల్యాప్‌టాప్ నుంచి వాట్సప్ వీడియో లేదా ఆడియో కాల్స్ మాట్లాడాలంటే కచ్చితంగా డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. యూజర్ల సౌకర్యార్థం వాట్సప్ వెబ్ వెర్షన్‌లోనే నేరుగా గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది మెటా. ఇక నుంచి బ్రౌజర్ ఓపెన్ చేసి సులభంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీనికి తోడు సంభాషణలను మరింత ఆకట్టుకునేలా చేసేందుకు కొన్ని కొత్త ఫీచర్లను కూడా వచ్చేశాయి. రాబోయే కొద్ది వారాల్లో ఈ అప్‌డేట్స్ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి.

కాల్ ట్రాన్స్‌ఫర్.. సంభాషణకు నో బ్రేక్:

ఈ కొత్త అప్‌డేట్స్‌లో ‘కాల్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. మనం బయట ఉన్నప్పుడు ఫోన్‌లో గ్రూప్ కాల్ మాట్లాడుతుంటే.. ఇంటికి వచ్చాక ఆ కాల్ కట్ అవ్వకుండానే నేరుగా ల్యాప్‌టాప్‌కి మార్చుకోవచ్చు. అలాగే సిస్టమ్‌లో మాట్లాడుతున్న కాల్‌ను ఫోన్‌కు కూడా పంపుకోవచ్చు. మధ్యలో ఎలాంటి అంతరాయం లేకుండా, మళ్లీ రీ-కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే సంభాషణను కొనసాగించవచ్చు.

Advertisement

Also Read: లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

వేచి ఉండేందుకు వెయిటింగ్ రూమ్:

పెద్ద పెద్ద మీటింగ్స్ లేదా ముఖ్యమైన గ్రూప్ కాల్స్ మాట్లాడేటప్పుడు ప్రైవసీ చాలా అవసరం. అందుకే వాట్సాప్ ‘వెయిటింగ్ రూమ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాల్ లింక్ తయారుచేసేటప్పుడు ‘అప్రూవల్’ ఆప్షన్ ఎంచుకుంటే.. లింక్ ద్వారా వచ్చేవారు నేరుగా కాల్‌లోకి రాకుండా వర్చువల్ లాబీలో వేచి ఉంటారు. హోస్ట్ అనుమతి ఇచ్చాకే వారు కాల్‌లో జాయిన్ అవ్వగలరు. దీంతో అనవసర వ్యక్తులను మీటింగ్స్‌లోకి రాకుండా అడ్డుకోవచ్చు.

స్మార్ట్ ఫీచర్స్.. హైక్వాలిటీ వీడియో:

Advertisement

ఈ బ్రౌజర్ కాల్స్‌లో స్క్రీన్ షేరింగ్ చేసుకోవడంతో పాటు ఎమోజీ రియాక్షన్లు పంపే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ‘క్విక్ హెచ్‌డీ’ సాంకేతికత ద్వారా కాల్ కనెక్ట్ అవ్వగానే వీడియో నాణ్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలు, ఇంట్లోని ఇతర నాయిస్‌ను తగ్గించేందుకు ‘నాయిస్ సప్రెషన్’ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

వెబ్ వాట్సప్ మరింత ఈజీ:

ఫోన్, డెస్క్‌టాప్ యాప్, బ్రౌజర్.. ఇలా దేని నుంచైనా కాల్ చేసినా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత యథావిధిగా వర్తిస్తుంది. కాల్ సమయంపై ఎలాంటి పరిమితులు లేకపోవడంతో వ్యక్తిగత, ఆఫీస్ అవసరాలకు వాట్సప్ వెబ్ ఇప్పుడు మరింత ఉపయోగకరంగా మారింది.

Also Read: ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×