E-Paper
Advertisement

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Tecno Pova 8 Pro 5G: ప్రముఖ టెక్నో సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘పోవా 8 ప్రో 5G’ భారత్‌లో విడుదల సిద్ధంగా ఉంది. ఆగస్టు 18న ఈ హ్యాండ్ సెట్ అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటే ఫోన్ డిజైన్‌కు సంబంధించిన వివరాలను కూడా టీజ్ చేసింది. ఇప్పటికే Tecno Pova 8 Pro 5G గ్లోబల్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో దీని ఫీచర్లపై మార్కెట్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

వెనుక వైపు రెండో డిస్‌ప్లే:

Tecno Pova 8 Pro 5Gలో ప్రధాన ఆకర్షణ దీని లుక్. వెనుక వైపు కెమెరా మాడ్యూల్ పక్కన ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’ పేరుతో ఒక సెకండరీ స్క్రీన్‌ను ఇచ్చారు. దీంతోపాటు ప్లాట్ మెటల్ ఫ్రేమ్, కుడివైపున ప్రత్యేకమైన ఆరెంజ్ కలర్ బటన్‌తో ఈ ఫోన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. గ్లోబల్‌గా ఇది ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టుండ్రా గ్రీన్ రంగుల్లో లభిస్తోంది.

Advertisement

Also Read: డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

మెరుగైన పనితీరు:

ఈ Tecno Pova 8 Pro 5G ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. 6.78 ఇంచుల హైపర్‌లక్స్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో గేమింగ్, వీడియో వీక్షణకు చాలా బాగుంటుంది.

కెమెరా, బ్యాటరీ విశేషాలు:

Advertisement

ఫొటోగ్రఫీ కోసం ఇందులో OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇకపోతే Tecno Pova 8 Pro 5Gలో 6,500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్‌‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు.

Also Read: యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×