E-Paper
Advertisement

కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!

కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!
Advertisement

Maruti Baleno Facelift 2026: మారుతి సుజుకి బాలెనో అభిమానులకు గుడ్ న్యూస్. కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. కొత్త బాలెనోను సెప్టెంబర్ 5న మార్కెట్ లోకి  విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత మరోసారి ఈ మోడల్ ను రిఫ్రెష్ చేస్తోంది.

కొత్త లుక్ ఎలా ఉంటుంది?

కొత్త బాలెనోలో బయట పెద్దగా మార్పులు లేకపోయినా, ముందు భాగంలో కొన్నికీలక డిజైన్ మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో కనిపించిన కార్లను బట్టి చూస్తే, కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. హెడ్‌ ల్యాంప్‌ల మధ్య సన్నగా కనిపించే క్రోమ్ స్ట్రిప్ కూడా కొత్త డిజైన్‌లో భాగంగా ఉండొచ్చని తెలుస్తోంది. వెనుక భాగంలో కూడా చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్త డిజైన్‌ తో కూడిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ను అందించే అవకాశం ఉంటుంది.

ఇంటీరియర్‌ గురించి..

Advertisement

క్యాబిన్ విషయానికి వస్తే ప్రస్తుత బాలెనోతో పోలిస్తే భారీ మార్పులు కనిపించకపోవచ్చు. టెస్టింగ్‌లో కనిపించిన మోడళ్లను బట్టి డ్యాష్‌ బోర్డ్ లేఅవుట్ దాదాపు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్త సీటు అప్‌హోల్స్టరీ, కొత్త కలర్ థీమ్ లాంటి మార్పులు రావచ్చు. అలాగే కొన్ని అడిషనల్ ఫీచర్లను యాడ్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఫీచర్లు వస్తాయా?

ప్రస్తుతం బాలెనోలో ఉన్న కొన్ని ఫీచర్లు కొత్త మోడల్‌ లో కూడా కొనసాగుతాయి. ఇందులో హెడ్ అప్ డిస్‌ ప్లే ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఈ సెగ్మెంట్‌ లో ఈ ఫీచర్ అందించే కార్లలో బాలెనో కూడా ఒకటి. అలాగే 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్, అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హైట్ సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు లాంటి ఫీచర్లు కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే, బ్రెజ్జాలో కనిపిస్తున్న 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను బాలెనోకు కూడా తీసుకువస్తారా? అనేది చూడాలి.

ఇంజన్‌ లో మార్పులు ఉంటాయా?

Advertisement

ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 88bhp పవర్, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో CNG వేరియంట్ కూడా కొనసాగవచ్చని భావిస్తున్నారు. అయితే, కొత్త బాలెనోలో టర్బో పెట్రోల్ ఇంజన్ వస్తుందనే టాక్ వినిపిస్తోంది.  కొత్త బాలెనోలో డిజైన్, ఫీచర్లు, ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పులు చేశారనేది సెప్టెంబర్ 5న అధికారికంగా తెలుస్తుంది.

ఆల్ట్రోజ్, i20తో పోటీ

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్ గతంతో పోలిస్తే కొంత తగ్గినా, ఈ విభాగానికి ఇంకా మంచి డిమాండ్ ఉంది. టాటా ఆల్ట్రోజ్ ఇటీవల అప్‌డేట్ కావడంతో బాలెనోకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఆల్ట్రోజ్‌లో పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లు ఉన్నాయి. మరోవైపు హ్యుందాయ్ i20 కూడా ఈ విభాగంలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: ఎంజీ హెక్టర్ హాక్ వచ్చేస్తోంది.. PHEV, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అదిరిపోయే ఎంట్రీ!

Tags

Related News

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

Big Stories

Advertisement
×