WhatsApp: తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్, మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ అకౌంట్ ను మెటా అకౌంట్స్ తో లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. అంటే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో పెట్టుకునే స్టేటస్ అప్ డేట్స్ ఇకపై వాట్సాప్ లో కనిపించనున్నాయి. అటు వాట్సాప్ లో పెట్టుకునే స్టేటస్ ఫేస్ బుక్, ఇన్ స్టాలోనే కనిపించేలా ఈ కొత్త ఫీచర్ ను రూపొందించింది. వాట్సాప్ ను అకౌంట్ ను మెటా అకౌంట్స్ తో లింక్ చేసుకునే ఈ ఫీచర్ ను డిఫాల్ట్ గా ఆఫ్ చేసి ఉంటుందని మెటా తెలిపింది.
ఫేస్ బుక్ పోస్టు.. వాట్సాప్ స్టేటస్ గా
కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రకారం.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో ఏదైనా అప్ డేట్ పెట్టగానే డీపాల్ట్ గా వాట్సాప్ స్టేటస్ గా కనిపించనుంది. ఈ ఫీచర్ తో వాట్సాప్ లో ప్రత్యేకంగా అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉండదని మెటా వెల్లడించింది. ఇతర ఫ్లాట్ ఫారమ్ లలో పోస్టు పెట్టగానే వెంటనే వాట్సాప్ స్టేటస్ గా దర్శనం ఇస్తుంది. యూజర్ ఒకేసారి అన్ని ఫ్లాట్ ఫారమ్ లలో ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయి ఉండేలా ఈ ఫీచర్ ఉపయోగపడటంతో పాటు టైమ్ ను సేవ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇకపై సింగిల్ ఆన్ క్యాపబులిటీతో వాట్సాప్ తో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ యాప్స్ లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పించబోతున్నది మెటా. ముఖ్యంగా హ్యాండ్ సెట్లను మార్చేటప్పుడు లేదంటే లాగ్ అవుట్ చేసిన తర్వాత ఒకేసారి అన్నింటిలోకి లాగిన్ అయ్యేలా ఉపయోగపడనుంది. అంతేకాదు, మున్ముందు ఈ యాప్స్ లో అవతార్ మనేజ్మెంట్, AI స్టిక్కర్ షేరింగ్ లాంటి టూల్స్ ను పరిచయం చేసేందుకు మెటా ఈ ఫీచర్ ను విస్తరించాలని భావిస్తున్నది. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రైవేట్ మెసేజ్ లు, కాల్స్ ను సురక్షితంగా ఉంచడం, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందని.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కు కనెక్ట్ అయినా, భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని మెటా వెల్లడించింది.
వాట్సాప్ ను మెటాకు ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే?
⦿ కొత్త ఫీచర్ ను ఉపయోగించుకోవాలని భావించిన వాళ్లు ముందుగా వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.
⦿ ఆ తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ మెనుకి నావిగేట్ చేయాలి.
⦿ మీ అకౌంట్ ను మెటా అకౌంట్ సెంటర్ కు యాడ్ చేసుకునే ఆప్షన్ ను గమనించండి. ఒకవేళ లేకపోతే, త్వరలో అందుబాటులోకి వస్తుందని గుర్తించాలి.
⦿ ఆప్షన్స్ మీద ట్యాప్ చేయాలి. ప్రాంప్ట్స్ ను ఫాలో కావాలి. మీ మెటా అకౌంట్ ఆధారాలతో లాగిన్ కావాలి.
⦿ ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ అకౌంట్స్ ను లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ ఒకవేళ మీరు ఈ ఫీచర్ ను ఉపయోగించకూడదనుకుంటే సెట్టింట్స్ లోకి వెళ్లి అకౌంట్స్ సెంటర్ నుంచి వాట్సాప్ ను తీసివేసే అవకాశం ఉంటుంది.
త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.
Read Also: ఇన్టాగ్రామ్ లో టిక్ టాక్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే!