Ghibli Style AI Images: సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఏదైనా ఘిబ్లీ స్టైల్ ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తీసుకొచ్చిన నయా ఫీచర్ కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. కొద్ది కాలం పాటు పెయిడ్ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ లో ఎక్కడ చూసినా ఈ ఫోటోలే కనువిందు చేస్తున్నాయి. విషయం ఏదైనా ఘిబ్లీ ఫోటోలనే యూజ్ చేసేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి సినిమా తారల వరకు అందరూ ఘిబ్లీ మాయలో పడిపోయారు. తమకు నచ్చిన ఫోటోలను క్షణాల్లో ఘిబ్లీ స్టైల్ ఫోటోలుగా మార్చుకుని సరదా పడుతున్నారు. ఇండియాలోనూ ఈ ఫీచర్ ను ఓ రేంజ్ లో యూజ్ చేస్తున్నారు. ఇంతకీ మన దేశంలో ఈ ఫీచర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రంతో పాటు అతి తక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఘిబ్లీ ఫీచర్ ను ఎక్కువగా ఎవరు వాడుతున్నారంటే?
గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గత వారం రోజులుగా ఇండియాలో ఈ ఫీచర్ ను నెటిజన్లు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నట్లు తేలింది. గత ఏడు రోజుల్లో మహారాష్ట్ర లోని నెటిజన్లు ఈ ఫీచర్ ను అత్యధిక స్థాయిలో వినియోగించినట్లు వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 74 శాతం, ఏపీలో 66 శాతం నెటిజన్లు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఇక మిజోరాం, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు తక్కువ ఆసక్తిని కనబర్చాయి. ఘిబ్లీని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో భారత్ టాప్ 5లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
GPT 40 పేరుతో అందుబాటులోకి ఘిబ్లీ స్టైల్
రీసెంట్ గా ఓపెన్ ఏఐ సంస్థ GPT 40 పేరుతో ఘిబ్లీ స్టైల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఏఐ ఇమేజ్ క్రియేటర్ వెర్షన్ ను నెటిజన్లు ఓ రేంజిలో వినియోగించుకుంటున్నారు. ఈ టూల్ ద్వారా ఈజీగా ఘిబ్లీ ఫోటోను క్రియేట్ చేసుకుంటున్నారు. నచ్చిన ఫోటోలను కన్వర్ట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు యానిమేషన్ చిత్రాల మాదిరిగా ఉండటంతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఫోటోలను పలు దేశాల్లోని గేమర్లు, డెవలపర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాంటి ఫోటోలను ఇష్టపడే వారు తాజా ఫీచర్ తో తమ ఫోటోలను సరికొత్తగా తయారు చేసుకుంటున్నారు
ఫ్రీగా ఘిబ్లీ స్టైల్ ఫోటోల క్రియేషన్
ఘిబ్లీ స్టైల్ ఫోటోలను ఛాట్ జీపీటీ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. జీపీటీ ప్లస్, ప్రో సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎలాంటి పరిమితి లేకుండా ఫోటోలను మార్చుకునే అవకాశం ఉంది. లేనివాళ్లు పరిమిత సంఖ్యలో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఘిబ్లీ ఫొటోల్లో దెయ్యాలు? లేని మనుషులు ఎలా కనిపిస్తున్నారంటూ ఆశ్చర్యం!