SRH VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన… ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దింతో కేకేఆర్ జట్టు మొదట బ్యాట్టింగ్ చేయాల్సి వచ్చింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు భారీ స్కోరే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ అలాగే రింకు సింగ్, రఘువంషి అదరగొట్టడంతో.. ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. అయితే ఈ మ్యాచ్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
రెండు చేతులతో బౌలింగ్ చేసిన హైదరాబాద్ బౌలర్
కేకేఆర్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ కామిండు మెండిస్ రెండు చేతుల బౌలింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్కు లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేశాడు. అదే వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేశాడు మెండిస్. ఈ తరుణంలోనే రఘువంశి వికెట్ కూడా పడగొట్టాడు మెండిస్. ఈ మ్యాచ్లో ఒకే ఒక్క ఓవర్ వేసిన మెండిస్ నాలుగు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్.. మెండిస్ కు బౌలింగ్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే కేకేఆర్ జట్టు భారీ స్కోర్ చేయక పోయేది. 150 పరుగుల వద్దే కట్టడి చేసే వాళ్ళు అని అంటున్నారు. ఇక ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో… 21 పరుగులు చేస్తే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే.. కేకేఆర్ పైన గత సీజన్ లో జరిగిన అవమానానికి ప్రతి కారం తీర్చుకోవచ్చు.
Also Read:Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
ఎవరి కామిండు మెండిస్
?
శ్రీలంకకు చెందిన మెండిస్ వయసు 26 సంవత్సరాలు. ఇతను స్పిన్ బౌలింగ్ చేస్తాడు. లెఫ్ట్ అలాగే రైట్ హ్యాండ్ తో.. చేయగల సమర్థుడు. ఇతన్ని మొన్నటి మెగా వేలంలో 75 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. అయితే ఇప్పటివరకు ఇతనికి అవకాశం ఇవ్వని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఇవాళ కేకేఆర్ పైన మాత్రం అవకాశం ఇచ్చింది. దీంతో తన ఈ సీజన్లో మొదటి వికెట్ పడగొట్టాడు. 2022లో శ్రీలంక తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టాడు మెండిస్.
Kamindu Mendis bowling left arm to right hander.
Kamindu Mendis bowling right arm to left hander.
– THIS IS CRAZY..!!!! 🤯😀 pic.twitter.com/2EcLRgPDYZ
— Tanuj (@ImTanujSingh) April 3, 2025