Milk Tooth: చంటిపిల్లలకు 10 నెలల నుండి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పళ్లు రావడం మొదలవుతుంది. ఈ పళ్లు అన్నీ ఒకేసారి రాకపోయినా నెలల వ్యవధిలో పిల్లలకు అన్ని పళ్లు వచ్చేస్తాయి. అయితే ఇలా వచ్చిన పళ్లు పిల్లలకు 10 సంవత్సరాలు వచ్చేసరికి ఒక్కొక్కటిగా ఊడిపోయి మళ్లీ కొత్త పళ్లు రావడం మనం చాలా మంది పిల్లల్లో గమనించే ఉంటాం. ఈ పళ్లు ఊడిపోయి మళ్లీ కొత్త పళ్లు రావడానికి గల కారణాలను ఈ కింది ఆర్టికల్ చదివి తెలుసుకుందాం.
చంటిపిల్లలకు వారి నెలల వయసులో వచ్చే పళ్లను పాల పళ్లు అంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఇలా వచ్చిన పళ్లు వారి 10-11 సంవత్సరాల వయసులో ఊడిపోయి కొత్త పళ్లు రావడం అనేది పిల్లల శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఈ వయసు పిల్లలలో జరిగే అనేక ముఖ్యమైన మార్పులలో దంతాలు అభివృద్ధి చెందడం ఒకటి. దీనిని అర్థం చేసుకోవడానికి కొన్ని కారణాలను తెలుసుకుందాం.
పిల్లలకు 6 నెలల నుండి 2 సంవత్సరాల మధ్య వచ్చే పాల పళ్లు 6 నుండి 12 సంవత్సరాల మధ్యలో మెల్లగా ఒక్కొక్కటిగా ఊడిపోయి 10 నుండి 11 సంవత్సరాల వయసులో కొత్త స్థిరమైన పళ్లు వస్తాయి. ఇది పిల్లల శరీర అభివృద్ధిలో జరిగే ఒక సహజ ప్రక్రియ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు 10 నుండి 11 సంవత్సరాల వయసులో దవడ పరిమాణం పెరగడంతో స్థిరమైన పళ్లకు స్థలం కల్పిస్తుంది. స్థిరమైన పళ్లు పాల పళ్ల కంటే బలంగా, పెద్దగా ఉండడంవల్ల ఇవి జీవితాంతం ఊడిపోకుండా ఉంటాయి. ఇవి 10 నుండి 11 సంవత్సరాల వయసులో ఎముకలలో అభివృద్ధి చెంది సరైన సమయంలో చిగుళ్ల ద్వారా బయటకు వస్తాయి.
చిన్నపిల్లల శరీరంలో జరిగే హార్మోనల్ మార్పులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 10 నుండి 11 సంవత్సరాల వయసు పిల్లలు వారి యౌవన దశకు దగ్గరలో ఉండడంవల్ల జరిగే హార్మోనల్ మార్పులు ఎముకలు, దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. పళ్లు అభివృద్ధి కావడం అనేది పిల్లలు తీసుకునే ఆహారం, నోటి ఆరోగ్యంపై కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు దంతాలకు బలాన్ని, అభివృద్ధిని అందిస్తాయని దంత వైద్యులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో, సరైన సమయంలో సరైన పద్ధతిలో పాత పళ్లు ఊడకపోయినా, కొత్తవి రాకపోయినా దంత వైద్యుడిని సంప్రదించి వారి సలహా తీసుకోవడం మంచిది. సరైన నోటి శుభ్రత, ఆహారపు అలవాట్లు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తాయి. ఈ వయసులో చిన్నపిల్లలకు పళ్లు ఎలా, ఎన్నిసార్లు శుభ్రం చేసుకోవాలి వంటి దంత సంరక్షణ చర్యల గురించి అవగాహన కల్పించాలి. ఈ 10 నుండి 11 సంవత్సరాల వయసులో పాత పాల పళ్లు ఊడిపోయి కొత్తవి లేదా స్థిరపళ్లు రావడం పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఒక సంకేతంగా భావించవచ్చు. ఈ దశలో తల్లిదండ్రులు అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల దంత ఆరోగ్యంపై గట్టి శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు.